వంజంగి మేఘాల కొండపై సూర్యోదయాన్ని తిలకిస్తున్న పర్యాటకులు
పాడేరురూరల్, జనవరి 17: మండలంలో సందర్శనీయ ప్రాంతమైన వంజంగి మేఘాలకొండకు సోమవారం ఉదయం పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం రాత్రి నుంచే అధిక సంఖ్యలో పర్యాటకులు మేఘాల కొండకు సమీపంలో టెంట్‌లు, గుడారాలు ఏర్పాటు చేసుకుని బస చేశారు. సోమవారం తెల్లవారుజామున కొండ పైకి చేరుకుని మేఘాలను చీల్చుకుంటూ వచ్చే భానుడ్ని ఆసక్తిగా తిలకించారు. అయితే సోమవారం కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో వంజంగి ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.