Advertisement
Advertisement
Abn logo
Advertisement

అదృష్టం అంటే ఆమెదే.. భర్తతో కలిసి పార్క్ విజిట్ చేసి.. లక్షాధికారి అయింది

ఇంటర్నెట్ డెస్క్: పార్క్‌లో సరదాగా భర్తతో కలిసి నడుచుకుంటూ వెళ్లిన మహిళను అదృష్టం వరించింది. దీంతో లక్షలాది రూపాయలు ఆమె సొంతం అయ్యాయి. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకున్న నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకూ అదృష్టం ఆమెను ఎలా వరించందనే వివరాల్లోకి వెళితే.. 


కాలిఫోర్నియాకు చెందిన నోరీన్ అనే మహిళ పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం విహార యాత్రకు వెళ్లాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె తన భర్తతో కలిసి ఆర్కాన్సాస్‌ రాష్ట్రానికి వెళ్లింది. అనంతరం అక్కడున్న టూరిస్ట్ ప్రదేశాలను విజిట్ చేస్తూ.. ఓ పార్కుకు వెళ్లింది. పార్కులో ప్రకృతిని ఆస్వాదిస్తూ భర్తతో కలిసి నడుస్తున్న ఆమె దృష్టిని పసుపు రంగులో ఉన్న చిన్న రాయి ఆకర్షించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ ఆమె.. భద్రంగా బ్యాగులో దాచుకుంది. అనంతరం పార్కులో ఆమెకు దొరికిన రాయికి సంబంధించిన పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆ రాయి గురించి ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. తనకు దొరికింది మామూలు రాయి కాదని.. 4.38 క్యారెట్ల అరుదైన వజ్రం అని గ్రహించి ఆశ్చర్యపోయింది. కాగా.. అరుదైన వజ్రం దొరకడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. నోరీన్‌కు దొరికిన వజ్రం విలువ సుమారు రూ.22-23లక్షల వరకూ ఉంటుందని సమాచారం. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement