Abn logo
Apr 13 2021 @ 00:15AM

పర్యాటకం ‘నాడు-నేడు’

- కనుమరుగవుతున్న పర్యాటక శోభ

- ‘పురం’పై ప్రభుత్వం చిన్నచూపు

- ఆగిన అభివృద్ధి పనులు

హిందూపురం, ఏప్రిల్‌ 12: పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం చిన్నచూపుతో చారిత్మ్రక, పర్యాటక కేంద్రాలు అభివృద్ది ఎదురుచూడాల్సివస్తోంది. ఈనేపథ్యంలోనే పర్యాటక కేంద్రాలు ఇటీవల పర్యాటక శోభను కోల్పోతున్నాయి. ప్రధానంగా జిల్లాలో శిల్పకళ క్షేత్రం లేపాక్షి, విదేశీపక్షుల విడిది కేంద్రం వీరాపురం, విజయనగర రెండవ రాజధాని పెనుకొండలో రెండేళ్లుగా పర్యాటక అభివృద్ది మందగించింది. ఈనేపథ్యంలోనే అభివృద్ది జాడలు లేక ఎక్కడ ఆగిన పనులు అక్కడే అన్న చందనంగా మారింది. ఇటీవల పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం పూర్తిగా చొరవచూపకపోవడంతో పర్యాటక అభివృద్ది కళతప్పుతోందన్న విమర్శలకు దారీతీస్తోంది. ఓవైపు ప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇవ్వకపోగా మరో వైపు కరోనాతో పర్యాటకల తాకిడి లేక పర్యాటక శోభను కోల్పోతున్నాయన్న ఆందోళన పర్యాటకుల్లో నెలకొంది. ఇటీవల పర్యాటక కేంద్రాల్లో గతంలో నిర్వహించిన వైభవాన్ని గుర్తుకు చేసుకునే రోజులు వచ్చాయని పర్యాటక, స్థానికుల్లో చర్చంశనీయంగా మారింది.

 గత వైభవం ఏదీ?

ప్రధానంగా జిల్లాలోనే పర్యాటక శిల్పకళ క్షేత్రం లేపాక్షిలో గత టీడీపీ ప్రభుత్వం హయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించి పది కోట్లకుపైగా అభివృద్ది పనులు చేపట్టి పర్యాటక శోభను తీసుకువచ్చారు. పర్యాటకులను ఆర్షించేలా దేవోదాయ, పురావస్తు, పర్యాటకతోపాటు పలు శాఖలు లేపాక్షిని అభివృద్ధి చేశారు. అయితే రెండేళ్ల కిందట చేపట్టి పనులకు సైతం వివిధ శాఖల ఆధ్యర్యంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లింపులో జాప్యంతో పనులు ఆర్థాంతరంగా ఆగిపోయాయి. ఇటీవల లేపాక్షి అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పైసా నిధులు ఇవ్వకపోడంతో కోనేరు, లేపాక్షి ఎంపోరియం, జఠాయువు మోక్షా ఘాట్‌, థీమ్‌ పార్కు అర్థాంరంగా నిలిచియాయి. 

సైబీరియా పక్షులకు రక్షణ అంతేనా?

ప్రతి ఏటా రష్యా, సైబీరియా వంటి శీతల దేశానికి చెందిన పెయింటెడ్‌ స్టార్స్క్‌గా పిలవబడే పక్షులు వేల మైళ్లు దాటి చిలమత్తూరు మండలం వీరాపురానికి వచ్చి పర్యాటకులను ఆహ్వానిస్తుంటాయి. ఏప్రిల్‌ వచ్చిందంటే పెయింటెడ్‌ స్టార్స్క్‌ పక్షులు ఎంతో ఉత్సాహంగా వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో విహరిస్తుంటే వాటిని చూసేందుకు పర్యాటకులు సందడి చేస్తుంటారు. అందమైన ఈ కొంగజాతి పక్షులు తమ విన్యాసాలతో సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటక, అటవీ శాఖల ఆధ్యర్యంలో పక్షులతోపాటు వచ్చే పర్యాటకులకు అవసరమైన మౌళిక సదుపాలు కల్పించాలి. గతంలో పర్యాటక శాఖ నుంచి రూ.35 లక్షలతో మరుగుదొడ్లు, అర్థాంతరంగా రెస్టారెంట్‌ నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన వదిలేశారు. పక్షులకు నీరు, ఆహారం, చెట్లపై పక్షులకు గూళ్లు ఏర్పాటు చేయాలని అటవీశాఖ ప్రతిపాదన దశలో సాగుతోంది. పక్షులకు, వాటి పిల్లలుకానీ ఎగరలేని వాటికి వీరాపురంలో నిర్మించిన ఫిష్‌పాట్‌ నిరుపయోగంగా మారింది. పక్షుల సంరక్షణ చర్యలతోపాటు పర్యాటకుల వసతుల కల్పన పూర్తిగా గాలికొదిలేశారు. 

పుష్కర కాలంగా ప్రతిపాదనలే..

విజయనగర రాజుల రెండవ రాజదాని పెనుకొండను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న హామీకి 11 ఏళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రధానంగా కొండపైకి రహాదారి నిర్మాణానికి విడతల వారిగా రూ.14 కోట్లు మంజూరు చేసినా పదేళ్లు నుంచి నిర్మాణ దశలోనే ఉంది. కుంభకర్ణ వద్ద రెస్టారెంట్‌, పెనుకొండలో స్వాగం తోరణం, కృష్ణదేవరాయులు కాస్య విగ్రహం మాత్రం నిర్మాణం చేపట్టారు. అదే విధంగా కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునరుద్దరణతోపాటు ఇస్కాన టెంపుల్‌, విద్యుత, నీటి సౌకర్యం, గవర్నర్‌ అథితి భవనం. జాతీయ మ్యూజియం, కృష్ణదేవరాయుల ఉద్యానవనంతోపాటు ప్రాచీన ఆలయాల, కట్టడా ల పరిరక్షణ పనులు ప్రతిపాదన దశలో కొసాగుతున్నా యి. రెండేళ్లు కాలంలో కొండ రోడ్డు నిర్మాణం అసరమైన నిధులకు సాంకేతిక అనుమతులు, కొండపైన ఇస్కాన టెంపుల్‌కు కేటాయించిన భూమికి అటవీశాఖ నుంచి అనుమతులు సాధించినట్లు అధికార యంత్రాంగం చెబుతున్నారు. అయితే పలు శాఖల నుంచి పైసా నిధులు విడుదల చేయకపోవడంతో పెనుకొండ పర్యాటక శోభను కోల్పోతోందన్న ఆందోళన పర్యాటకులో నెలకొంది. 


ప్రతిపాదనలు పంపాం..  -ఈశ్వరయ్య, ఆర్‌డీ, పర్యాటక శాఖ

జిల్లా పర్యాటక కేంద్రాల్లో అవసరమైన అభివృద్ది పనులు చేపట్టేందుకు రెండేళ్లుగా ప్రతిపాదనలు చేస్తు న్నాం. లేపాక్షిలో ఇప్పటికే గత ఐదేళ్లలో పది కోట్ల దాకా అభివృద్ది పనులు చేపట్టాం. అలాగే విదేశీ పక్షుల విడిది వీరాపురంలో రూ.35 లక్షలతో పర్యాటకుల అవసరమైన వసతులు ఏర్పాటు చేశాం. పెనుకొండలో స్వాగతం తోరణం, కుంభకర్ణ వద్ద టూరిజం రెస్టారెంట్‌ నిర్మాణం చేపట్టాం. పర్యాటక కేంద్రాల్లో అభివృద్ధి ప్రతి పాదనలపై ప్రభు త్వం నిధుల కేటాయింపును బట్టి పనులు చేపడతాం. 

నిర్మాణ దశలోనే జఠాయువు ఘాట్‌


వీరాపురంలో నీరులేని ఫిష్‌పాట్‌


Advertisement
Advertisement
Advertisement