Abn logo
Sep 27 2021 @ 03:38AM

‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్ట్‌.. యాదగిరికి టూరిజం ఎక్సలెన్సీ అవార్డు

చాంద్రాయణగుట్ట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్సలెన్సీ అవార్డు-2021కు ఓల్డ్‌సిటీ అలియాబాద్‌కు చెందిన ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్ట్‌ వర్కాల యాదగిరి ఎంపికయ్యారు. తెలుగు ప్రచురణ విభాగం నుంచి యాదగిరిని పర్యాటక శాఖ అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు.