ఆ కేక్‌ కట్‌ చేయను!

ABN , First Publish Date - 2021-01-23T09:27:52+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన అజింక్యా రహానెను స్థానిక దాదర్‌లోని అతడి కాలనీ వాసులు ఘనంగా స్వాగతించారు

ఆ కేక్‌ కట్‌  చేయను!

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన అజింక్యా రహానెను స్థానిక దాదర్‌లోని అతడి కాలనీ వాసులు ఘనంగా స్వాగతించారు. అంతేకాదు కేక్‌ తెప్పించి వారు దానిని కట్‌ చేయాల్సిందిగా అజింక్యాను కోరారు. అయితే ఆ కేక్‌పై భారత పతకాన్ని చేబూనిన కంగారూ బొమ్మ ఉండడంతో.. దానిని కట్‌ చేసేందుకు రహానె నిరాకరించాడు. కంగారూ ఆస్ట్రేలియాకు చిహ్నం కావడం, ఆ దేశ కరెన్సీపైనా ముద్రించి ఉండడంతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కొన్ని  సంస్థలు కంగారూను తమ లోగోగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ జంతువు బొమ్మ ఉన్న కేక్‌ను రహానె కట్‌ చేసేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆ బొమ్మను తీసేశాక రహానె కేక్‌ కట్‌ చేశాడు. 

Updated Date - 2021-01-23T09:27:52+05:30 IST