భారత్‌కు గడ్డుకాలం అర్వింద్‌ సుబ్రమణియన్‌

ABN , First Publish Date - 2020-06-04T05:44:25+05:30 IST

కొవిడ్‌-19 ప్రభావంతో జీడీపీ భారీగా క్షీణిస్తుందన్న అంచనాల నడుమ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఈ ఏడాది చివరికి సవరించాల్సివస్తుందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌...

భారత్‌కు గడ్డుకాలం అర్వింద్‌ సుబ్రమణియన్‌

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ప్రభావంతో జీడీపీ భారీగా క్షీణిస్తుందన్న అంచనాల నడుమ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఈ ఏడాది చివరికి సవరించాల్సివస్తుందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్‌ సుబ్రమణియన్‌ అన్నారు. భారతదేశానికి ఇది అత్యంత గడ్డు సంవత్సరమని ఆయన ఒక వెబినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రభావం వల్ల ఈ ఏడాది భారతదేశ రుణభారం జీడీపీలో 85 శాతం వరకు పోతుందన్న అభిప్రాయం ఆయన ప్రకటించారు.


వృద్ధిరేటును ఉద్దీపింపచేసేందుకు దీటుగా ఆర్థిక రంగాన్ని పునరుజ్జీవింపచేయడం చాలా కష్టమని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని, 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను భారీ స్థాయిలో సవరించడం తప్పనిసరి అన్నారు. సంపన్న దేశాలతో పోల్చితే లాక్‌డౌన్‌ ప్రభావం వర్థమాన దేశాలపై అధికంగా ఉంటుందని సుబ్రమణియన్‌ చెప్పారు. కార్మిక సంస్కరణలు తప్పనిసరి అయినా కొన్ని రాష్ర్టాల చర్యలు కార్మికుల కనీస రక్షణలకు ముప్పుగా ఉన్నాయని ఆయన అన్నారు. 



Updated Date - 2020-06-04T05:44:25+05:30 IST