భాకర్‌కు కఠిన ‘పరీక్ష’

ABN , First Publish Date - 2021-05-17T10:03:35+05:30 IST

ఒలింపిక్స్‌లో పతకం తీసుకురాగలదనే భారీ అంచనాలున్న యువ షూటర్‌ మను భాకర్‌ ఓవైపు షూటింగ్‌ సాధన చేస్తూనే....

భాకర్‌కు కఠిన ‘పరీక్ష’

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం తీసుకురాగలదనే భారీ అంచనాలున్న యువ షూటర్‌ మను భాకర్‌ ఓవైపు షూటింగ్‌ సాధన చేస్తూనే.. మరోవైపు పుస్తకాలతో కుస్తీ పడుతోంది. ట్రైనింగ్‌, పోటీల కోసమని భాకర్‌ సహా కొందరు భారత షూటర్లు 3 నెలల పర్యటన నిమిత్తం క్రొయేషియా వెళ్లింది. అయితే, 19 ఏళ్ల భాకర్‌ తన బీఏ పరీక్షలను ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంది. పరీక్షలు మొదలైన రెండ్రోజు లకే అంటే.. 20వ తేదీ నుంచి జరిగే యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌లోనూ భాకర్‌ పోటీపడాలి. దీంతో భాకర్‌ తాను బసచేస్తున్న హోటల్‌ రూమ్‌లో తన పరీక్షలకు సిద్ధమవుతూనే.. షూటింగ్‌ సాధన చేస్తోంది. ఏదేమైనా ఈ కఠిన ‘పరీక్ష’ను విజయ వంతంగా అధిగమిస్తానని భాకర్‌ చెప్పింది.

Updated Date - 2021-05-17T10:03:35+05:30 IST