పట్టణాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-21T06:00:19+05:30 IST

జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అభివృద్ధి దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సంగీతస త్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు.

పట్టణాభివృద్ధికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- కలెక ్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి టౌన్‌, మే 20 : జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అభివృద్ధి దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సంగీతస త్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. తన కార్యా లయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పట్టణ ప్రగతి కింద జిల్లాకు వచ్చిన నిధులు, వాటి వినియోగంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని కమిషనర్లను సూచించారు. ఇందులో చేపట్టే పను లు ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.పట్టణాల్లో ప చ్చదనం పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల ని పట్టణ ప్రకృతి వనాలను ఎవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మొక్కల సం రక్షణ చేపట్టాలన్నారు. ప్రతి వార్డులో క్రీడామైదానం ఏర్పాటుచేసేందుకు స్థలాన్ని గుర్తించాలన్నారు. భూ సమస్య ఉన్న ప్రాంతాల్లో 2రెండు వార్డులను గుర్తిం చాలని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్‌ టాయిలెట్ల పరిశు భ్రతపై ఆకస్మిక తనిఖీలు చేట్టాలని ఆదేశించారు. ఆ గస్టు చివరినాటికి ప్రతి మున్సిపాలిటీకి శ్మశానవాటి క, సమీకృత వెజ్‌,నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. పట్టణాల్లో నెలకొల్పిన నైట్‌ షెల్టర్‌ అర్ధవంతంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్లు చాడల తిరుపతి, శ్రీ నివాస్‌రెడ్డి, సుమన్‌, శారద, తదితర అధికారులు పాల్టొన్నారు. 

Updated Date - 2022-05-21T06:00:19+05:30 IST