నో టచ్‌ సీజన్‌లో టచ్‌ డివైజ్ ఏంట్రా బాబూ‌‌?

ABN , First Publish Date - 2020-05-01T20:31:49+05:30 IST

మనుషుల మధ్య దూరాలు చెరిపేయడానికి అంటరానితనం నేరం అనేవాళ్లం ఒకప్పుడు. ఇప్పుడు కరోనా కారణంగా ఎవరూ ఎవరినీ అంటకూడని పరిస్థితులు ఏర్పడి, అంటరానితనం ఒక అవసరంగా మారిపోయింది.

నో టచ్‌ సీజన్‌లో టచ్‌ డివైజ్ ఏంట్రా బాబూ‌‌?

మనుషుల మధ్య దూరాలు చెరిపేయడానికి అంటరానితనం నేరం అనేవాళ్లం ఒకప్పుడు. ఇప్పుడు కరోనా కారణంగా ఎవరూ ఎవరినీ అంటకూడని పరిస్థితులు ఏర్పడి, అంటరానితనం ఒక అవసరంగా మారిపోయింది. మరి ఈ నో టచ్‌ సీజన్లో ఓ టచ్‌ డివైజ్‌ వచ్చింది. దీంతో ఏ స్క్రీన్‌నైనా టచ్‌ స్క్రీన్‌ చేసుకోవచ్చు. ముట్టుకోకుండానే మన పనులు కానిచ్చేయచ్చు. మరి ఈ నాన్‌ టచింగ్‌ సీజన్లో ఈ టచ్‌ డివైజ్‌ గురించి రాంజీ బాబ్జీ ఏం అంటున్నారో చూడండి.


Using a small device now we can covert every screen a touch screen. Without even touching we can access things on screen and give commands. But in this no-touch season is this an appropriate accessory to use?


టెక్‌ టాక్‌ : డోంట్‌ టచ్‌! అంటరానితనం ఒక అవసరం?


రాంజీ : ఏరా బాబ్జీ విన్నావా? ఒక మంచి టచ్‌ డివైజ్‌ వచ్చింది! సింపుల్‌ అండ్‌ యూజ్‌ఫుల్‌! గొప్పగా ఉందిలే!

బాబ్జీ : ఏంటి టచ్‌ డివైజా? ఓర్నీ. మనిషిని మనిషి టచ్‌ చేయడానికే భయపడుతున్న టైమ్‌రా ఇది. ఇప్పుడు టచ్‌ డివైజ్‌లూ టెక్నాలజీ అంటావేంటి?


రాంజీ : ఎంటర్‌టైన్‌మెంట్‌లోనూ వర్క్‌లోనూ ఉపయోగపడే చిన్న డివైజ్‌ వచ్చిందిరా. దాని గురించి చెబుతున్నా.

బాబ్జీ : డివైజ్‌ వచ్చింది సరే. ఎక్కణ్ణించి వచ్చింది? ఏ దేశం నుంచొచ్చింది? ముందది చెప్పు. కొంపదీసి చైనా నుంచి కాదు కదా?


రాంజీ : ముందు చెప్పేది వినరా! ఈ డివైజ్‌ని... ఏ స్క్రీన్‌కి ఎటాచ్‌ చేసినా... ఆ స్క్రీన్‌ కాస్తా టచ్‌ స్క్రీన్‌లా అయిపోతుంది.

బాబ్జీ : ఓస్‌. ఇలాంటివి చాలా వచ్చాయ్‌, ఎప్పుడో వచ్చాయ్‌ కదరా? కొత్తగా చెబుతావేంటి? మన కాలేజ్‌ల్లోనూ యూనివర్సిటీల్లోనూ ప్రొజెక్టర్లు వేసి పాఠాలు చెప్పేటప్పుడు ఇలాంటి ఇంటరాక్టివ్‌ డివైజ్‌లు ఎప్పటినుంచో వాడుతున్నారు.


రాంజీ : ఇది వాటిలో కాదురా. చాలా స్మాల్‌ సైజ్‌... చెప్పాలంటే ఓ చిన్న క్లిప్‌లా ఉంటుంది. ల్యాప్‌టాప్‌కి గానీ, కంప్యూటర్‌ మానిటర్‌ కి గానీ , ప్రొజెక్టర్‌ స్క్రీన్‌కి గానీ .. దేనికైనా ఎటాచ్‌ చేసేసుకోవచ్చు దీన్ని! ఎటాచ్‌ చేశాక టచ్‌ కూడా చేయక్కర్లేదు. జస్ట్ దాని ముందు జెశ్చర్స్‌ ఇస్తే చాలు.

బాబ్జీ : జెశ్చర్స్‌... అంటే చేతులు కదపడమేగా?


రాంజీ : అవున్రా అలా అలా చేతులాడిస్తే చాలు... స్క్రీన్‌ ని టచ్‌ చేయకుండానే కమాండ్స్‌ ఇచ్చేయచ్చు. వర్క్‌ చేసుకోవచ్చు. గేమ్స్‌ ఆడుకోవచ్చు. ఏదీ టచ్‌ చేయకుండానే గాల్లోనే అన్ని పనులూ జరిగిపోతాయ్‌.

బాబ్జీ : నాకు నచ్చిందిరా!


రాంజీ : ఏది? డివైజేగా?

బాబ్జీ : టచ్‌ చేయక్కర్లేదన్నావు చూడు. ఆ పాయింట్‌ నచ్చింది! అసలీ కరోనా సీజన్లో ఇలాంటి వైర్‌లెస్‌, టచ్‌లెస్‌ డివైజ్‌లే అవసరం.


రాంజీ : ( బ్లింక్‌ )

బాబ్జీ : అవున్రా. మా చిన్నప్పుడు.. అంటరానితనం నేరం అనేవారు… ఇప్పుడది నేరం కాదు... అవసరం.


రాంజీ : అవును మరి.. మనుషుల మధ్య భేదాలు ఉండకూడదని అలా అనేవారు. ఇప్పుడు భేదాలేవీ లేవు. అసలు ఎవడూ ఎవరినీ టచ్‌ చేయకపోవడమే బెటర్‌.

బాబ్జీ : ఇంతకీ ఈ టచ్‌ డివైజ్‌ పేరేంటన్నావ్‌?


రాంజీ : గ్లామోస్‌ అనీ … చాలా చిన్నగా ఉంటుంది. సింపుల్‌గా జేబులో వేసుకుని పోవచ్చు.

బాబ్జీ : అదొక్కటే నచ్చలేదురా నాకు...


రాంజీ : ఏంట్రా? జేబులో వేసుకు పోవడమా? అంటే ఈజీగా ఎవరైనా కొట్టేస్తారనా?

బాబ్జీ : కాదురా. జేబులో వేసుకోవాలంటే దాన్ని టచ్‌ చేయాలి కదా? మరి దాన్ని కూడా టచ్‌ చేయకుండా జేబులో పెట్టేసుకోడానికి కూడా విధంగా ఏదైనా టెక్నాలజీ ఉంటే బావుణ్ణు.


రాంజీ : బావుంది. ఆ డివైజ్‌ గాల్లో వచ్చి నీ జేబులో పడిపోవాలా ఏంటి?

బాబ్జీ : కరెక్ట్‌గా చెప్పావ్‌. అచ్చం అదే నేను కోరుకునేది.


రాంజీ : అదేంట్రా?

బాబ్జీ : సేఫ్టీరా సేఫ్టీ. మనుషుల్ని మనుషులిప్పుడు ఎలాగూ ముట్టుకోరు. ఇదిగో ఇలాంటి డివైజ్‌ల వల్ల స్క్రీన్లు ముట్టుకునే అవసరం కూడా తగ్గిపోతుంది. ఇక ఈ డివైజ్‌ని కూడా ముట్టుకోవక్కర్లేకుండా... అదే చక్కగా గాల్లో ఎగురుతూ జేబులోకి వచ్చిపడే టెక్నాలజీ కూడా వచ్చేసిందనుకో. మరింత సూపర్‌ సేఫ్‌ కదా? ఏమంటావ్‌?


రాంజీ : ( ఎక్స్‌ప్రెషన్‌ )


వీడియో ఇక్కడ చూడండి :



Updated Date - 2020-05-01T20:31:49+05:30 IST