Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 23 Sep 2022 02:24:38 IST

మళ్లీ మళ్లీ తూచ్‌!

twitter-iconwatsapp-iconfb-icon
మళ్లీ మళ్లీ తూచ్‌!

శాశ్వత అధ్యక్ష పదవిని జగన్‌ తిరస్కరించారట!

కొత్త విషయం చెప్పిన సజ్జల

ఐదేళ్లే పదవిలో ఉంటారని వెల్లడి

నాడు వేదికపైనే విజయసాయి ప్రకటన

‘ఆమోదిస్తూ’ జగన్‌ నవ్వులు, నమస్కారాలు

ఈసీ ఆదేశాలతో అంతా రివర్స్‌



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఇక అధ్యక్షుడే జీవిత కాల అధ్యక్షుడు. పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసేశాం. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవితకాల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు’... అని ఆ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఘనంగా ఒక ప్రకటన చేశారు. ఆ వెంటనే వైసీపీ కార్యకర్తలు చప్పట్లు, ఈలలు, కేకలతో హర్షధ్వానాలతో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. వేదికపైన ఉన్న నేతలంతా నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ... వేదికపై ఆశీనుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనదైన శైలిలో నవ్వులు చిందిస్తూ... ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ ఉన్న వారందరికీ నమస్కరించారు. ఇది ఈ ఏడాది జూలై 9వ తేదీన జరిగిన తతంగం! ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ‘శాశ్వత అధ్యక్షుడిగా ఉండేందుకు జగన్‌ తిరస్కరించారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రకటించారు. ఎప్పుడు తిరస్కరించా? తిరస్కరించిన విషయం ఎవరికి చెప్పారు? అని మాత్రం అడగొద్దు! రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షులు ఉండరు. అలా ఎన్నుకోవడం కుదరదు. అయినా సరే... పార్టీ ప్లీనరీలో జగన్‌కు శాశ్వత అధ్యక్ష పదవి కట్టబెట్టారు. నిబంధనలు తెలిసీ తెలియక ఆ తప్పు చేసి ఉండొచ్చు! కానీ... ‘శాశ్వతం’పై ఎన్నికల కమిషన్‌ ప్రశ్నించిన తర్వాతైనా హుందాగా తప్పు ఒప్పుకుంటే బాగుండేది. కానీ... చేసిన తప్పును ‘కవర్‌’ చేసేందుకు వైసీపీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. ‘శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు మీడియాలో మాత్రమే వార్తలు వచ్చాయి. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నాం’ అని ఎన్నికల కమిషన్‌కు ఒక తప్పుడు వివరణ ఇచ్చారు. ఇక... గురువారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి, ‘శాశ్వత అధ్యక్ష పదవిని జగన్‌ తిరస్కరించారు. అందువల్ల దీనిని మినిట్స్‌లో నమోదు చేయలేదు’ అని మరో కొత్త విషయం చెప్పారు. తమ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేరని, ఐదేళ్ల కాలానికి జగన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని.. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేశామని అన్నారు. అసలు విషయం ఏమిటంటే...  శాశ్వత అధ్యక్ష పదవిని జగన్‌ తిరస్కరించినట్లు ఇప్పటిదాకా వైసీపీ నేతలెవరూ చెప్పలేదు. తిరస్కరించినట్లుగా మినిట్స్‌లో నమోదు చేశారో లేదో తెలియదు. పైగా పార్టీకి ఎప్పటికీ జగనే అధ్యక్షుడిగా ఉంటారని.. ప్రతి ప్లీనరీలోనూ ఎన్నుకోవడం కంటే.. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పేముందని నాటి మంత్రి పేర్ని నాని అప్పుడు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.