Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 08 Jun 2022 11:00:00 IST

Tottempudi Venu : చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా?

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా బాగా పేరు తెచ్చుకున్న వారు.. ఆ తర్వాత కాలంలో తెరమరుగయ్యారు. అలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. విజయాలు దక్కక కొందరు, ఆఫర్స్ అందుకోలేక మరికొందరు సినిమాలకు దూరమయ్యారు. ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్న హీరో తొట్టెంపూడి వేణు (Tottempudi Venu). టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హిట్స్ తో జోరుమీదుండేవాడు ఈ హీరో. ‘స్వయంవరం (Swayamvaram), చిరునవ్వుతో (Chirunavvutho), కళ్యాణరాముడు (Kalyana Ramudu), పెళ్ళాం ఊరెళితే (Pellam Ooelithe), చెప్పవే చిరుగాలి (Cheppave Chirugali)’ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ‘హనుమాన్ జంక్షన్’ (Hanumanjunction) చిత్రంలో అయితే అద్భుతమైన కామెడీ పండించి సత్తా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ.. కాలం కలిసిరాలేదు.

వేణు హీరోగా ఆఖరిగా తెరపై కనిపించిన చిత్రం ‘రామాచారి : వీడో పెద్ద గూఢచారి’ (Ramachari : Veedo pedda gudhachari). ఈ సినిమా తర్వాత వేణు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో యన్టీఆర్ (NTR)  దమ్ము (Dammu) చిత్రంతో కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ సినిమా ఫ్లాప్‌తో వేణుకు ఆ తర్వాత అంతగా ఆఫర్స్ దక్కలేదు. ప్రస్తుతం రవితేజ (Raviteja) ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

తాజాగా వేణు హీరోగా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్ పై అనురాగ్ (Anurag), శరత్ (sharath) నిర్మించబోతున్న ఈ సినిమాకి సూర్య (Surya) అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను కొద్దిరోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరి లాంగ్ గ్యాప్ తో మళ్ళీ హీరోగా ప్రవేశిస్తున్న వేణు ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ఎలా మెప్పిస్తాడో,  ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement