కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌లో... 6.17 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు...

ABN , First Publish Date - 2022-02-09T21:15:35+05:30 IST

దేశవ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6.17 కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేశారు.

కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్‌లో... 6.17 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు...

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6.17 కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేశారు. వీటిలో... 19 లక్షలమంది ట్యాక్స్ ఆడిట్ రిప్రోట్స్‌ను కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు చేశారు. వీటిలో 48 శాతం ఐటీఆర్-1(2.97 కోట్లమంది), తొమ్మిది శాతం ఐటీఆర్-2(56 లక్షలు), 13 శాతం మంది ఐటీఆర్-3 (81.6 లక్షలు), 27 శాతం మంది  ఐటీఆర్-4 (1.65 కోట్లు), ఐటీఆర్-5 (10.9 లక్షలు), ఐటీఆర్-6 (4.84 లక్షలు), ఐటీఆర్-7 (1.32 లక్షల మంది) ఉన్నారు. కాగా... 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయా రంగాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా... వేతనజీవులను బడ్జెట్ నిరాశపరచిందన్న వ్యాఖ్యానాలు వెల్లువెత్తాయి. 

Updated Date - 2022-02-09T21:15:35+05:30 IST