కరోనా స్పీడ్‌

ABN , First Publish Date - 2020-07-11T10:02:58+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ స్పీడ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా స్పీడ్‌

జిల్లాలో మరోసారి రికార్డుస్థాయిలో కేసులు నమోదు

శుక్రవారం ఒక్కరోజే 148 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ

1955కు చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య

యాక్టివ్‌ కేసులను దాటిన డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య

జిల్లాలో ఇప్పటి వరకు 980 మంది డిశ్చార్జ్‌.. చికిత్స పొందుతున్న 960 మంది


విశాఖపట్నం, జూలై 10, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్‌ స్పీడ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, మరో 148 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల 1955కు చేరింది. జిల్లాలో మొదటిసారిగా యాక్టివ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ కేసుల సంఖ్య పెరిగింది. శుక్రవారం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది వైరస్‌ నుంచి కోలుకుని 980 మంది డిశ్చార్జ్‌ కాగా, మరో 960 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


ఎండాడలో మహిళకు.. 

   గ్రేటర్‌ 8వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో మహిళ(50)కు కరోనా సోకింది. జీవీఎంసీ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న సదరు మహిళకు శుక్రవారం వచ్చిన ఫలితాల్లో పాజి టివ్‌గా నిర్ధారణ అయింది. వివేకానందనగర్‌లోని వార్డు సచివాలయంలో వైరస్‌ బారినప డిన మహిళ కుమారుడు వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. దీంతో అతన్ని పరీక్షలు నిమిత్తం అధికారులు తరలించారు. 


విశాలాక్షినగర్‌లో మహిళకు..  

గ్రేటర్‌ 9వ వార్డు పరిధిలోని విశాలాక్షినగర్‌ ఎస్సీ, ఎస్టీ కాలనీలో మహిళ(33) కరోనా వైర స్‌ బారినపడ్డారు. వైరస్‌ బారినపడిన సదరు మహిళ ఆనందపురం గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు వైరస్‌ నిర్ధారణ కావడంతో సహచరులు, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 


టెక్కలిపాలెంలో ఒకరికి..

సబ్బవరం మండలం టెక్కలిపాలెంలో ఓ వ్యక్తి(40)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతను విశాఖలో చినగదిలి ప్రాంతంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ అక్కడే భార్యాపిల్ల లతో ఉంటున్నాడు. అయితే, టెక్కలిపాలెంలో ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు తర చూ వెళ్లి వస్తుంటాడు. గత వారం జ్వరం రావడంతో టెక్కలిపాలెం దరి గుల్లేపల్లి పీహెచ్‌ సీలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అతనికి శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


సింహాచలం డిపో వద్ద ఒకరికి..

 సింహాచలం డిపో ఎదురుగా ఉన్న బాలాజీ గార్డెన్స్‌లో ఓ వృద్ధుడు(76)కి శుక్రవారం కరో నా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో బాధితుడిని కొవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. కాంటాక్ట్‌ అయిన వారిని, కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 


70వ వ్యక్తికి కరోనా పాజిటివ్‌

 జీవీఎంసీ 70వ వార్డు ఎర్రగెడ్డ కాలనీకి చెందిన నలభై ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడినట్టు శుక్రవారం వైద్యాధికారులు నిర్ధారించారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడంతో టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఆటో డ్రైవర్‌ అయిన ఇతను ప్రతి రోజూ కలెక్టరేట్‌ జంక్షన్‌లోని ఒక ఆసుపత్రి వైద్యుడిని గాజువాక నుంచి తీసుకువెళ్లి తిరిగి తెస్తుంటాడు. అయితే, వైరస్‌ బారిన ఎలా పడ్డాడన్నది తెలియాల్సి ఉంది. 


కరోనాతో మహిళ మృతి..

వెంకోజీపాలెం బ్రె యిన్‌ వ్యాధితో ప్రథమ ఆసుపత్రిలో చికిత్స పొంది అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన డాక్టర్స్‌ కాలనీకి చెందిన మహిళ(60) శుక్రవా రం మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తరువాత గురువారం పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆమెతో ప్రైమరీ కాంటాక్టులతో సహా పక్కింటి వారికి, బంధువులకు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. కరోనాతో మృతి చెందడం వలన వైద్య సిబ్బంది మృతదేహాన్ని తీసుకునివెళ్లారు. అయితే, దీనిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. 

Updated Date - 2020-07-11T10:02:58+05:30 IST