మాడుగులలో కుండపోత వర్షం

ABN , First Publish Date - 2022-07-02T06:27:19+05:30 IST

మాడుగులతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉంది.

మాడుగులలో కుండపోత వర్షం
రోడ్డుపై పారుతున్న వర్షం నీరు


మాడుగుల రూరల్‌, జూలై 1: మాడుగులతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉంది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆకాశమంతా మేఘావృతమై భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. నారుమడుల్లో నీరు చేరడంతో విత్తనాలు చల్లుకునేందుకు అనుకూలంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చెరకు నాట్లేసిన మడుల్లోని నీరు చేరడంతో ఎదుగుదల ఉంటుందని అంటున్నారు.

 

Updated Date - 2022-07-02T06:27:19+05:30 IST