కెనడాలో భారతీయుడి హత్య.. అనుమానితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-13T21:27:17+05:30 IST

ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. డ్యూటీకి వెళ్తున్న 21ఏళ్ల యువకుడిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ

కెనడాలో భారతీయుడి హత్య.. అనుమానితుడి అరెస్ట్

ఎన్నారై డెస్క్: ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. డ్యూటీకి వెళ్తున్న 21ఏళ్ల యువకుడిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కాగా.. ఈ కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితుడిని అరెస్ట్ చేసి, వివరాలను వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



టొరెంటోని సబ్‌వే గుండా డ్యూటీకి వెళ్తున్న 21ఏళ్ల కార్తిక్ వాసుదేవ్‌పై గురువారం సాయంత్రం ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. శరీరంలోకి బులెట్లు చొచ్చుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డ కార్తిక్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం ఖండించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసును కెనడా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలిజా ఎలియాజర్ మహేపత్ అనే అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జి స్ట్రీట్‌లో శనివారం ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోతుండగా పట్టుకున్న అధికారుల.. కార్తిక్‌పై కూడా ఇతడే కాల్పులు జరిపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కార్తిక్ కేసులో హంతకుడు ఇతడేనా కాదా అనే విషయంతోపాటు కాల్పులు జరపడానికి గల కారణాలు విచారణలో వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. 




Updated Date - 2022-04-13T21:27:17+05:30 IST