దేశంలో తప్పక చూడాల్సిన 10 ప్రముఖ దేవాలయాలు.. సందర్శిస్తే అన్ని కోర్కెలు నెరవేరుతాయట!

ABN , First Publish Date - 2021-12-18T12:55:59+05:30 IST

దేశంలో తప్పక చూడాల్సిన 10 ప్రముఖ దేవాలయాలు.. సందర్శిస్తే అన్ని కోర్కెలు నెరవేరుతాయట!

దేశంలో తప్పక చూడాల్సిన 10 ప్రముఖ దేవాలయాలు.. సందర్శిస్తే అన్ని కోర్కెలు నెరవేరుతాయట!

భారతదేశంలోని హిందువుల నమ్మకాలకు.. దేవాలయాలకు వీడదీయరాని అనుబంధం ఉంది. దేవునిపై అపరిమితమైన నమ్మకం కలిగినవారు దేవుని కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఆలయాలకు లక్షల రూపాయల విరారాళాలు కూడా అందజేస్తుంటారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన, అందరూ తప్పకుండా చూడాల్సిన 10 ఆలయాల గురించి తెలుసుకుందాం.




2. వేంకటేశ్వర దేవాలయం, తిరుపతి (ఆంధ్రప్రదేశ్)

తిరుపతిలో కొలువైన వేంకటేశ్వర ఆలయానికి ప్రతిరోజూ లెక్కకుమించి భక్తులు వస్తుంటారు. వీరు ఆలయ హుండీలో విరాళాలు వేస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ కొర్కెలు తప్పక తీరుతాయని నమ్ముతారు.


3. సాయిబాబా ఆలయం, షిర్డీ (మహారాష్ట్ర)

18వ శతాబ్దంలో సాయిబాబా ఇక్కడ నివసించారు. అన్ని మతాల వారు సాయిబాబాను విశ్వసిస్తారు. షిర్డీలోని ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం దర్శనం కోసం వస్తుంటారు. బాబా సింహాసనం 94 కిలోల బంగారంతో తయారు చేశారు. భారతదేశంలోని ధనిక దేవాలయాల జాబితాలో ఈ ఆలయం మూడవ స్థానంలో ఉంది.


4. వైష్ణోదేవి ఆలయం (జమ్మూ & కాశ్మీర్) 

జమ్మూ జిల్లాలోని కట్రా సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇది తిరుపతి ఆలయం తర్వాత భక్తులు అత్యధికంగా సందర్శించే రెండవ ఆలయం. ఈ ఆలయం 5,200 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్లు.


5. సిద్ధి వినాయక ఆలయం, ముంబై (మహారాష్ట్ర)

సిద్ధి వినాయక దేవాలయం ముంబైలో ఉంది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ఆలయ గోపురం 3.7 కిలోల బంగారంతో పూత పూయబడివుంటుంది. ఈ ఆలయ వార్షిక ఆదాయం 100 కోట్లకు పైగానే ఉంటాయి. 


6. మీనాక్షి ఆలయం, మదురై(తమిళనాడు) 

మధురైలో ఈ ఆలయం ఉంది. ప్రతిరోజూ 20 వేల మందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. 14వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మొఘల్ పాలకుడు మాలిక్ కాఫర్ ధ్వంసం చేశాడని తెలుస్తోంది. మీనాక్షి తిరుకల్యాణం ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 6 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది.


7. జగన్నాథ దేవాలయం, పూరీ (ఒడిశా)

జగన్నాథుడు కొలువైన ఈ ఆలయం పూరీలో ఉంది. జగన్నాథుడిని దరిద్ర నారాయణ (పేదల దేవుడు) అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దం నుంచి ఈ ఆలయంపై 18 సార్లు దాడులు జరిగాయి. 


8. కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి(యూపీ)

ఈ ఆలయం వారణాసిలో ఉంది.ఈ  ఆలయ వార్షిక విరాళం 6 కోట్లకు పైగానే ఉంటుంంటారు. ఇక్కడ నిర్మించిన గోపురాలు బంగారు పలకలతో రూపొందించారు. దేశంలోని ధనిక దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి.


9. అమర్‌నాథ్ గుహ, అనంత్‌నాగ్(జమ్మూకశ్మీర్)

ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తుంటారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాలలోని ఈ అమర్‌నాథ్ గుహ ఉంది. ప్రతి ఏటా జూలై నుండి ఆగస్టు వరకు భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతుంటుంది.


10. శబరిమల ఆలయం (కేరళ)

కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్‌లో ఈ ఆలయం ఉంది. ఆలయానికి ఏడాది పొడవునా లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. దేశవ్యాప్తంగా భక్తులు దీక్షలు చేపట్టి ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం 100 మిలియన్లకు పైగా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం అందమైన కొండల మధ్య ఉంది.
















1. పద్మనాభస్వామి ఆలయం, తిరువనంతపురం(కేరళ)

పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిని కలిగివుంటుంది. ఈ ఆలయానికి ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉందని తెలుస్తోంది.























Updated Date - 2021-12-18T12:55:59+05:30 IST