ఆ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించొచ్చు: ఆంథోనీ ఫౌచీ

ABN , First Publish Date - 2021-01-18T15:20:19+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్ ప్రకటించిన ఐదంచెల వ్యాక్సినేషన్ ప్రణాళికను ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సమర్థించా

ఆ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించొచ్చు: ఆంథోనీ ఫౌచీ

న్యూయార్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న జో బైడెన్ ప్రకటించిన ఐదంచెల వ్యాక్సినేషన్ ప్రణాళికను ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సమర్థించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఐదంచెల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళికను కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తాను అధికారం చేపట్టగానే అంటే ఈ నెల 20 నుంచి అమలు చేసే ప్రణాళిక ప్రకారం 100 రోజుల్లో 10కోట్ల మందికి టీకా వేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైడెన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఫౌచీ మాట్లాడారు. ఈ సందర్భంగా జో బైడెన్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చన్నారు. ‘ఆయన పెట్టుకున్న లక్ష్యం స్పష్టంగా ఉంది. అది కచ్చితంగా సాధించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు’ అన్నారు. కాగా.. ఆంథోనీ ఫౌచీని బైడెన్.. కొవిడ్‌పై ముఖ్య సలహాదారుడిగా నియమించుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1.74లక్షల కొవిడ్ కేసులు నమోదవ్వగా.. 1800 మందికిపైగా మరణించారు. దీంతో ఆ దేశంలో కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. 


Updated Date - 2021-01-18T15:20:19+05:30 IST