ప్రపంచంలో టాప్ 3 ధనిక కుటుంబాలు ఏవో తెలుసా..

ABN , First Publish Date - 2021-11-27T03:32:03+05:30 IST

అపార సంపదను ఆర్జించిన ఆ మూడు కుటుంబాలు ఏవో తెలుసా..

ప్రపంచంలో టాప్ 3 ధనిక కుటుంబాలు ఏవో తెలుసా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బిలియనీర్లు అంటే మనం టక్కున అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అనో లేదా టెస్లా వ్యవస్థాపకుడు ఏలాన్ మస్క్ అనో చెప్పేస్తాం. వీరంతా కేవలం ఒక్క తరంలోనే అపార సంపదను సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా పేరుపొందారు. అయితే.. కొన్ని కుటుంబాలు మాత్రం తరతరాలుగా వ్యాపారాల్లో మునిగితేలుతూ కోట్లకు పడగలెత్తాయి.. ప్రపంచంలోనే ధనిక కుటుంబాలుగా ఆవిర్భవించాయి. మనదేశంలోని టాటాలు, అంబానీలు ఈ కోవలోని వారే. అంబానీల శకాన్ని ఆరంభించింది ధీరూబాయి అంబానీ అయితే.. ఆయన కుమారుల సారథ్యంలో ఈ వ్యాపార సామ్రాజ్యం మరింతగా విస్తరించింది. జెషెడ్జీ టాటాతో ప్రారంభమైన టాటాల ప్రస్థానం.. ప్రస్తుతం రతన్ టాటా నేతృత్వంలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. మొదటి మూడు ధనిక కుటుంబాలు అమెరికాలోనే ఉన్నాయి. 


నెం. 1 స్థానంలో వాల్టన్ కుటుంబం...

వాల్ మార్ట్..ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో అనేంతగా పాపురల్ అయిన సూపర్‌మార్కెట్ చెయిన్. వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్. నాడు మొదలైన ఈ మహా వ్యాపార సామ్రాజ్యం నేడు వాల్టన్ కుటుంబంలోని ఐదో తరం వారసులు నిర్వహిస్తున్నారు. వాల్టన్ కుటుంబం సంపద విలువ దాదాపు 205 బిలియన్ డాలర్లు. ఇది అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ కంటే ఎక్కువ. 


నెం .2 ..మార్స్ ఫ్యామిలీ..

దాదాపు శతాబ్దం క్రితం ఫ్రాంక్ మార్స్.. తనపేరుపైనే చాక్లెట్ల కంపెనీని ప్రారంభించారు. కాల క్రమంలో ఆ కంపెనీ నుంచి స్నీక్కర్స్, ఎమ్ అండ్ ఎమ్ డోవ్ వంటి చాక్లెట్లు ఆ కంపెనీ ఉత్పత్తి చేసింది. అయితే.. పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తుల ద్వారానే ప్రస్తుతం కంపెనీకి అధికంగా ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలు ఐదో తరం వారసుల చేతుల్లో ఉంది. మార్స్ కుటుంబ సంపద విలువ 141 బిలియన్ డాలర్లు. 


నెం. 3 ఖోక్ కుటుంబం

చమురు ఉత్పత్తి వ్యాపారంలో ఉన్న ఖోక్ కుటుంబం మొత్తం సంపద విలువ 124 బిలియన్ డాలర్లు. వీరి వ్యాపార ప్రస్థానం ఫ్రెడ్ ఖోక్ స్థాపించిన చమురు సంస్థతో ప్రారంభమైంది. ఫ్రెడ్ తరువాత.. ఆ కంపెనీ ఆయన నలుగురు కుమారులకు సంక్రమించింది. ఆ తదనంతర కాలంలో ఇద్దరు కుమారులు ఈ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో వ్యాపారం మిగిలిన ఇద్దరు కుమారుల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం చార్ల్స్ ఖోక్ కంపెనీ బోర్డు చైర్మన్‌గా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2021-11-27T03:32:03+05:30 IST