టాప్‌ టెన్‌

ABN , First Publish Date - 2020-10-01T09:21:56+05:30 IST

నేరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ దేశవ్యాప్తంగా పదోస్థానంలో నిలిచింది. 2017- 2019కు సంబంధించిన జాతీయ

టాప్‌ టెన్‌

నేరాల్లో గ్రేటర్‌ స్థానం 

మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు

రోడ్డు ప్రమాదాల్లో ఆరో స్థానం

ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి  


గ్రేటర్‌లో నమోదైన నేరాలు 

2017      14,462

2018      14,332

2019    15,333 

 

2019లో..

హత్యలు 86

హత్యాయత్నాలు 203

రోడ్డు ప్రమాద మరణాలు 360

భ్రూణ హత్యలు   21

దాడులు 511

యాసిడ్‌ దాడి  1


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): నేరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ దేశవ్యాప్తంగా పదోస్థానంలో నిలిచింది. 2017- 2019కు సంబంధించిన జాతీయ నేర గణాంకాల పట్టిక (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో)ను బుధవారం విడుదల చేశారు. ఈ మూడేళ్ల కాలంలో వివిధ నేరాలకు సంబంధించి మెట్రోనగరాల్లో, అలాగే ప్రత్యేక/స్థానిక చట్టాలకు సంబంధించిన కేసుల్లోనూ ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ పదో  స్థానంలో ఉండగా, నమోదైన కేసుల సంఖ్య 2018 కంటే 2019కి భారీగా పెరిగింది.


2019లో దేశవ్యాప్తంగా 2,064 హత్యలు జరగ్గా 520 హత్యలతో ఢిల్లీ  ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 86 హత్యలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్యలోనూ ఢిల్లీ టాప్‌లో ఉండగా,  హైదరాబాద్‌ ఆరో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో 2019లో మొత్తం 360 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. మొత్తంగా నేరాల్లో నగరం పదోస్థానంలో నిలిచింది.


ఎన్‌సీఆర్‌బీ ఇచ్చిన గణాంకాల్లో అహ్మదాబాద్‌ సూరత్‌(గుజరాత్‌), బెంగళూరు (కర్ణాటక), చెన్నయ్‌, కోయంబత్తూర్‌ (తమిళనాడు), ఢిల్లీ, లక్నో, గజియాబాద్‌, కాన్పూర్‌ (యూపీ), హైదరాబాద్‌ (తెలంగాణ), ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌), జైపూర్‌ (రాజస్థాన్‌), కోచి, కోజికోడ్‌ (కేరళ), కోల్‌కాతా (పశ్చిమ బెంగాల్‌), ముంబై, పుణె, నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), పాట్నా (బిహార్‌) నగరాలకు సంబంధించిన నివేదిక రూపొందించారు.

2019లో మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగాయి. 2017లో 2,272 నేరాలు నమోదు కాగా, 2018లో 2,332 నేరాలు నమోదయ్యాయి. 2019లో ఏకంగా నేరాల సంఖ్య 2,755కు చేరింది. 


అత్యాచారాలు 184

దాడులు 126 

రవాణా మార్గాల్లో దాడులు

ఇతర ప్రాంతాల్లో 28 

అత్యాచార యత్నాలు 173 

కిడ్నాప్‌లు/మిస్సింగ్‌లు 838

కిడ్నాప్‌/ డబ్బులు డిమాండ్‌ 3

యువతులు/మహిళల అక్రమ రవాణా 27

భర్త/అత్తింటి దాడులు 1,568

కించపరచడం 112

పోక్సో కేసులు 285


ఇతర నేరాలు

దాడులు 4,071

దోపిడీలు/చోరీలు 1,596

నకిలీ కరెన్సీ 9

మోసాలు 154

ఫోర్జరీ 416

ర్యాష్‌ డ్రైవింగ్‌ 2,616

ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల గాయాలు 416

బాల కార్మికులు 21

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 25

ఆయుధ చట్టం కింద... 38

ఐటీ కేసులు 1,379

మాదక ద్రవ్యాలు 99

సిగరెట్‌, పొగాకు ఉత్పత్తులు 180

పెండింగ్‌ కేసులు 2,076

ట్రయల్‌ పెండింగ్‌ 5,109

శిక్షలు పడిన కేసులు 163

శిక్ష పడిన వారు 711 


Updated Date - 2020-10-01T09:21:56+05:30 IST