కీపర్లలో పంత్‌కు ‘టాప్‌’ ర్యాంక్‌

ABN , First Publish Date - 2021-01-21T09:41:24+05:30 IST

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్‌ పంత్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

కీపర్లలో పంత్‌కు ‘టాప్‌’ ర్యాంక్‌

దుబాయ్‌: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్‌ పంత్‌ టెస్ట్‌ క్రికెట్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో పంత్‌ 691 పాయింట్లతో 19 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 13వ స్థానానికి చేరాడు. పుజార 7వ, రహానె 9వ ర్యాంకుల్లో నిలిచారు. కోహ్లీ 2 నుంచి 4వ ర్యాంక్‌కు పడిపోయాడు. విలియమ్సన్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో అశ్విన్‌, బుమ్రా వరుసగా 8వ, 9వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. సిరాజ్‌ 32 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరాడు. 

Updated Date - 2021-01-21T09:41:24+05:30 IST