స్మిత్‌కు టాప్‌ ర్యాంక్‌

ABN , First Publish Date - 2021-06-17T09:25:55+05:30 IST

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో ర్యాంక్‌ నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు.

స్మిత్‌కు టాప్‌ ర్యాంక్‌

కోహ్లీకి నాలుగో స్థానం

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ రెండో ర్యాంక్‌ నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో స్మిత్‌ 891 రేటింగ్‌ పాయింట్లతో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (886)ను వెనక్కినెట్టి నెంబర్‌వన్‌గా నిలిచాడు. గతేడాది బాక్సింగ్‌ డే టెస్ట్‌ తర్వాత స్మిత్‌కు మళ్లీ టాప్‌ ర్యాంక్‌ దక్కింది. కేన్‌ అగ్రస్థానం నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత సారథి విరాట్‌ కోహ్లీ (814) ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. రిషభ్‌ పంత్‌, రోహిత్‌ శర్మ సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో కమిన్స్‌, అశ్విన్‌ టాప్‌-2లో ఉన్నారు. ఆల్‌రౌండర్‌ విభాగంలో జాసన్‌ హోల్డర్‌, రవీంద్ర జడేజా, బెన్‌ స్టోక్స్‌, అశ్విన్‌ టాప్‌-4 ర్యాంక్‌ల్లో మార్పులేదు. 

Updated Date - 2021-06-17T09:25:55+05:30 IST