HDFC : ప్రపంచంలోనే అత్యధిక సామాజిక రుణం పొందిన హెచ్‌డీఎఫ్‌సీ

ABN , First Publish Date - 2022-08-06T01:36:46+05:30 IST

భారత్‌లో టాప్ తనఖా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ (Housing Development Finance Corporation) కీలక ప్రకటన చేసింది.

HDFC : ప్రపంచంలోనే అత్యధిక సామాజిక రుణం పొందిన హెచ్‌డీఎఫ్‌సీ

న్యూఢిల్లీ : భారత్‌లో టాప్ తనఖా రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ (Housing Development Finance Corporation) కీలక ప్రకటన చేసింది. 1.1 బిలియన్ డాలర్ల భారీ సామాజిక రుణాన్ని (social loan) సమీకరించినట్టు ప్రకటించింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.8,700 కోట్లుగా ఉన్న ఈ రుణ ప్రపంచంలోనే అత్యధిక సామాజిక రుణమని పేర్కొంది. తక్కువ ధరలకే నివాసాలు, సుస్థిరాభివృద్ధితో సంబంధమున్న ప్రాజెక్టులకు ఈ నిధులను ఫైనాన్స్ చేయనున్నట్టు వివరించింది. ‘సిండికేటెడ్ సోషల్ లోన్ ఫెసిలిటీ’ కింద ఇన్వెస్టర్ల సమూహం ఈ రుణాన్ని అందజేయనున్నారు. ఈసీబీ(ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్) మార్గంలో ఈ నిధులు సేకరించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. 90 బేసిస్ పాయింట్లకుపైగా ఎస్‌వోఎఫ్‌ఆర్(secured overnight financing rate)తో ఈ లోన్ ప్యాకేజీని పొందినట్టు వివరించింది.

Updated Date - 2022-08-06T01:36:46+05:30 IST