Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 08 May 2022 03:06:02 IST

కాంగ్రెస్‌లోకి రండి

twitter-iconwatsapp-iconfb-icon
కాంగ్రెస్‌లోకి రండి

పార్టీ సిద్ధాంతాలను, విధానాలను విశ్వసించే వారందరికీ స్వాగతం

తెలంగాణ  ప్రజల స్వప్నాన్ని నాశనం చేసిన టీఆర్‌ఎస్‌ను సాగనంపుదాం

ఆ బాధ్యత కాంగ్రెస్‌ పార్టీతోపాటు రాష్ట్రంలోని యువతపైనా ఉంది: రాహుల్‌

పనిచేసే వారికే ఎన్నికల్లో టికెట్లు ఇస్తాం

ఢిల్లీకి రావొద్దు.. హైదరాబాద్‌ను వీడాలి

గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో మమేకం కావాలి

ప్రజల మధ్యలో ఉంటే గెలుపు కాంగ్రెస్‌దే

భేదాభిప్రాయాలతో మీడియాకు ఎక్కొద్దు

కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ దిశానిర్దేశం

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం

ఎన్‌ఎస్‌యూఐ నేతలకు రాహుల్‌ భరోసా

చంచల్‌గూడ జైలులో విద్యార్థులతో ములాఖత్‌


హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎ్‌సను సాగనంపే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీతోపాటు రాష్ట్రంలోని యువత అందరిపైనా ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. అందరినీ ఆహ్వానిస్తున్నానని, అంతా కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి.. రాష్ట్రాన్ని బాగుచేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో టీపీపీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని సోనియాగాంధీ మీ అందరితో కలిసి కలలు కన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఏర్పాటు వల్ల పార్టీకి నష్టం జరిగింది. అయినా మీ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే మీ వెంటే ఉండి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో కాంగ్రెస్‌ సిద్ధాంతాలను, విధానాలను విశ్వసించే చాలా మంది పార్టీ బయట ఉన్నారు. వారందరి కోసం పార్టీ తలుపులు తెరిచి ఉంచాలి. అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ పార్టీలోకి వచ్చి.. మాతో కలిసి కేసీఆర్‌కు, టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి’’ అని రాహుల్‌ అన్నారు. తెలంగాణ యువత ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనను, దోపిడీని కళ్లారా చూసిందని తెలిపారు. ‘‘మీకు బడులు, కాలేజీలు, యూనివర్సిటీలు దక్కలేదు. మీ నిధులను, భవిష్యత్తును దోచుకున్నారు. అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయి. తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని ఒక వ్యక్తి దెబ్బతీశారు. తెలంగాణను వంచించిన శక్తులతో పొత్తులు ఉండవు’’ అని రాహుల్‌ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్యే పోరాటం ఉంటుందని రాహుల్‌గాంధీ చెప్పారు.


‘‘కేసీఆర్‌ తెలంగాణను దోచుకున్నారు. వాళ్లకు డబ్బులకు కొదవ లేదు. వారి వెంట పోలీసులున్నారు. వారి చేతుల్లో ప్రభుత్వం ఉంది. కానీ, వారి వెంట ప్రజల్లేరు. ప్రజలను మించిన శక్తి లేదు. ఆ ప్రజలతో కలిసి మనం పోరాటం చేయాలి. మనముందు రెండు మూడు లక్ష్యాలున్నాయి. తెలంగాణను ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. రాబోయే కాలంలో ఒకరిద్దరి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాకుండా.. ప్రజల, రైతులు, పేద వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై దృష్టి పెడదాం. ఇదే మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి పార్టీలో ఐక్యత అవసరం. అంతా కలిసికట్టుగా ఉండాలి’’ అని రాహుల్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో టికెట్‌లు నాయకుల ప్రతిభ ఆధారంగానే ఇస్తామని, దీనిపై రెండో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ తనను అడగొద్దన్నారు. ‘‘పార్టీ కోసం పనిచేసేవారు, ప్రజల మధ్య ఉండేవారు, రైతుల పక్షాన, పేద వర్గాల తరఫున పోరాటం చేసే వారికే టికెట్లు ఇస్తాం. ఇది మన కుటుంబం.. ఎవరి పట్లా వివక్ష చూపించం. ఎంత సీనియర్‌లైనా, ఎన్నేళ్ల చరిత్ర ఉన్నా కూడా పనిచేయకపోతే టికెట్లు ఇవ్వబోం. స్వతంత్రంగా, క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకున్నాకే ఇస్తాం. ప్రజలు ఎవరిని కోరుకుంటారో వారికే టికెట్లు దక్కుతాయి. హైదరాబాద్‌లో కూర్చుంటే టికెట్లు రావు. ఇక్కడ కూర్చోవద్దు. ఢిల్లీకి రావొద్దు. గ్రామాలకు వెళ్లండి. వీధుల్లోకి ఎక్కండి. మీరంతా సమర్థవంతులు. మీకు ప్రజలే టికెట్‌ ఇస్తారు. ప్రజల వద్దకే వెళ్లండి’’ అని రాహుల్‌ సూచించారు. ప్రజల మధ్య ఉంటే కాంగ్రెస్‌ తప్పకుండా గెలుస్తుందన్నారు. 


నాలుగు గోడల మధ్యే మాట్లాడుకోవాలి..

‘‘మనది ఆర్‌ఎ్‌సఎస్‌ లాంటి సంస్థ కాదు. అక్కడ ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు అమలవుతాయి. కాంగ్రెస్‌ పార్టీ ఒక కుటుంబం. భిన్నాభిప్రాయాలుంటాయి. మీ అందరి అభిప్రాయాలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం. అది కూడా మీడియాకు ఎక్కకపోతేనే. ఒక కుటుంబం ఇంట్లో  నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్నట్లే పార్టీలోని అంశాలపైనా మాట్లాడుకోవాలి. ఫిర్యాదులు, బేధాభ్రిపాయాలు ఉంటే వినడానికి పార్టీలో విభాగాలున్నాయి.


మీడియాకు ఎక్కి అభిప్రాయాలు వెల్లడించేవాళ్లు పార్టీకి నష్టం చేసేవారే. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. నిన్న వరంగల్‌లో సభ విజయవంతమయింది. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడం వల్ల ఈ సభ విజయవంతమయింది. దీనికి మీకందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని రాహుల్‌ అన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ను తెలంగాణ  రైతాంగానికి, ప్రజలకు వివరించే బాధ్యత నేతలదేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మహ్మద్‌ అలీ షబ్బీర్‌, వి.హనుమంతరావు, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సీఎం కేసీఆర్‌ ఒంటిచేత్తో నాశనం చేశారని ట్విటర్‌లో రాహుల్‌గాంధీ ఆరోపించారు. 


నా జిల్లా అని ఎవరూ అనొద్దు

‘‘ఇది నా జిల్లా, నా నియోజకవర్గం అని ఏ నా యకుడూ పట్టుకు కూర్చోకూడదు. ఆయా జిల్లాల్లో పార్టీలో చేరికలను అడ్డురావద్దు’’ అని తెలంగాణ  పార్టీ ముఖ్యులకు రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్లు తెలిసింది. కొత్త ఓటర్లు పార్టీలోకి రాకుండా ఎలా గెలుస్తామని ప్రశ్నించినట్లు సమాచారం. ఇక్కడి ఓ హోటల్‌లో బస చేసిన రాహుల్‌గాంధీ.. శనివారం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార క మిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికల ప్ర స్తావన రాగా.. ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసాన్ని పూర్తి చేయాలంటే కొత్త ఓటర్లు, నేత లు, శక్తులు రావాల్సిందే కదా! అని విశ్లేషించినట్లు తెలిసింది. కాగా, కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో దేశంలోనే మంచిర్యాల నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు సభ్యత్వం నమోదు చేయించి న మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీ సీ అధ్యక్షురాలు సురేఖకు రాహుల్‌ అభినందనలు తెలిపారు. మరోవైపు పలువురు ఓయూ విద్యార్థి నేతలు గాంధీభవన్‌లో రాహుల్‌ను కలిశారు.  విద్యా ర్థి నేతలు చనగాని దయాకర్‌, మానవతారాయ్‌, కె.వెంకటేశ్‌ తదితరులతో రాహుల్‌ కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రతినిధులు వేణుగోపాల్‌రెడ్డి, జి.వెంకటేశ్‌, కె.శ్రీనివాస్‌, మధు కూడా రాహుల్‌గాంధీని కలిశారు. 

కాంగ్రెస్‌లోకి రండి


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.