Abn logo
Sep 21 2020 @ 22:31PM

మిస్కిన్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన మణిరత్నం

Kaakateeya

మిస్కిన్‌ దర్శకత్వంలో విడుదలైన ‘పిశాసు’(తెలుగులో పిశాచి) చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ చిత్రం అందించిన విజయంతో అదే రకం కథతో తాజాగా ‘పిశాసు-2’ పేరుతో ఆయన కొత్త చిత్రం రూపొందించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై మురుగానందం నిర్మించనున్నారు. అందాల భామ ఆండ్రియా ఈ చిత్రంలో హీరోయిన్‌ నటించనున్నట్లు నిర్మాత మురుగానందం తెలిపారు. ఇక మిస్కిన్ 49వ పుట్టినరోజు వేడుకలు తాజాగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ విశేషం ఏమిటంటే.. ఈ వేడుకను ప్రముఖ దర్శకుడు మణిరత్నం హోస్ట్ చేశారు. 

ఈ వేడుకలో మణిరత్నంతో పాటు శంకర్‌, బాలాజీ శక్తివేల్‌, శశి, గౌతమ్‌ మీనన్‌, లింగుస్వామి వంటి దర్శకులు హాజరయ్యారు. టాలీవుడ్‌లో కూడా ఇటీవల దర్శకులందరూ పార్టీలో కనిపించిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో కూడా టాప్‌ దర్శకులందరూ ఇలా కలిసి వేడుక జరుపుకోవడం చాలా మంచి పరిణామంగా అందరూ చెప్పుకుంటుండటం విశేషం.

Advertisement
Advertisement
Advertisement