Rahul కు బాసటగా Congress వర్చువల్ మీట్

ABN , First Publish Date - 2022-06-09T02:20:16+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానుండటంతో ఆ పార్టీ అగ్రనేతలు..

Rahul కు బాసటగా Congress వర్చువల్ మీట్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానుండటంతో ఆ పార్టీ అగ్రనేతలు గురువారంనాడు (9వ తేదీ) వర్చువల్ మీట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, ఇన్‌చార్జిలు, పీసీసీ చీఫ్‌లు ఈ వర్చువల్ మీట్‌లో పాల్గొంటున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. సాయంత్రం 4 గంటలకు ఈ వర్చువల్ మీట్ జరుగనుంది.


ఈడీ ముందు రాహుల్ హాజరయ్యే సమయంలో అందరూ ఆయన వెంటనే ఉండాలని పలువురు కాంగ్రెస్ నేతలు, ఎంపీలు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేస్తారని, దీనిపై పార్టీ సమావేశంలో (వర్చువల్ మీట్) చర్చించనున్నారని తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్  కేసులో ఈనెల 2న తమ ముందు హాజరు కావాలని ఈడీ ఇటీవల రాహుల్‌కు సమన్లు పంపింది. అయితే ప్రస్తుతం తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, సమయం కావాలని రాహుల్ ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో విచారణ తేదీని ఈనెల 13వ తేదీకి ఈడీ మార్చింది.

Updated Date - 2022-06-09T02:20:16+05:30 IST