సీడీఎస్ రావత్‌కు నివాళులర్పించిన పొరుగు దేశాల టాప్ కమాండర్లు

ABN , First Publish Date - 2021-12-10T21:39:26+05:30 IST

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు

సీడీఎస్ రావత్‌కు నివాళులర్పించిన పొరుగు దేశాల టాప్ కమాండర్లు

న్యూఢిల్లీ : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులర్పించినవారిలో శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల టాప్ మిలిటరీ కమాండర్లు ఉన్నారు. శ్రీలంక సైన్యం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ కమాండర్ జనరల్ షవేంద్ర సిల్వ, రాయల్ భూటాన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ బ్రిగేడియర్ డోర్జీ రించెన్, నేపాల్ సైన్యం చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బాలకృష్ణ కర్కి, బంగ్లాదేశ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డివిజన్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ వకార్ ఉజ్ జమన్ నివాళులర్పించారు. 


జనరల్ రావత్‌తో కలిసి నేషనల్ డిఫెన్స్ కాలేజీలో చదివిన శ్రీలంక మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ రవీంద్ర చంద్రిసిరి విజేగుణరత్నే (రిటైర్డ్) కూడా తన స్నేహితునికి నివాళులర్పించారు. 


జనరల్ రావత్ కుమార్తెలు కృత్తిక, తరిణి కూడా కడసారి నమస్కరించి, నివాళులర్పించారు. 


Updated Date - 2021-12-10T21:39:26+05:30 IST