Top 10 richest NRIs: అత్యంత సంపన్న ఎన్నారైల జాబితాలో అదానీ సోదరుడే టాప్.. హిందుజా బ్రదర్స్ కూడా ఆయన తర్వాతే..

ABN , First Publish Date - 2022-09-24T15:19:25+05:30 IST

విదేశాల్లో ఉంటూ కోట్లు సంపాదిస్తున్న ఎన్నారైలకు (NRIs) సంబంధించి సంపన్నుల వివరాలను ఐఐఎఫ్‌ఎల్ హెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022(IIFL Wealth Hurun India Rich List 2022) పేరిట బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 94 మంది ఎన్నారైలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈ జాబితాలో..

Top 10 richest NRIs: అత్యంత సంపన్న ఎన్నారైల జాబితాలో అదానీ సోదరుడే టాప్.. హిందుజా బ్రదర్స్ కూడా ఆయన తర్వాతే..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఉంటూ కోట్లు సంపాదిస్తున్న ఎన్నారైలకు (NRIs) సంబంధించి సంపన్నుల వివరాలను ఐఐఎఫ్‌ఎల్ హెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022(IIFL Wealth Hurun India Rich List 2022) పేరిట బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాదిలో మొత్తం 94 మంది ఎన్నారైలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈ జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు, వ్యాపారవేత్త వినోద్ శాంతిలాల్ అదానీ (Vinod Shantilal Adani) అత్యంత సంపన్న ప్రవాస భారతీయుడిగా మొదటి స్థానం దక్కించుకున్నారు. వినోద్ అదానీ రూ.1.69 లక్షల కోట్ల నికర విలువతో అత్యంత సంపన్న ఎన్నారైగా ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో వినోద్ అదానీ సంపద 28 శాతం (రూ.37,400 కోట్లు) వృద్ధిని నమోదు చేసింది.


అంటే ఆయన గత సంవత్సరంలో రోజుకు సగటున రూ.102 కోట్లు సంపాదించారు. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద 850 శాతం పెరిగింది. అదే సమయంలో గత ఐదేళ్లలో గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలో సంపద 15.4 రెట్లు పెరగ్గా, వినోద్ అదానీ అండ్ ఫ్యామిలీ సంపద 9.5 రెట్లు పెరిగింది. దాంతో ఆయన ప్రవాసుల్లో కుబేరుడిగా ఎదిగారు. దుబాయ్‌లో నివాసముండే వినోద్ అదానీ & ఫ్యామిలీ స్వదేశంతో పాటు విదేశాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఆయన 1976లో ముంబైలో టెక్స్‌టైల్ ప్యాపారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత బిజినెస్‌ను సింగపూర్‌కు విస్తరించారు. అనంతరం 1994లో దుబాయ్‌కు వెళ్లిన తర్వాత మధ్యప్రాచ్యానికి తన బిజినెస్‌ను తీసుకెళ్లారు. 


హిందూజా సోదరులు కూడా ఆయన కంటే వెనుకే ఉన్నారు. హిందూజా బ్రదర్స్ రూ.1.65 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. లండన్‌లో నివాసముండే హిందూజా ఫ్యామిలీ 1990 నుంచి అత్యంత సంపన్న ఎన్నారైల జాబితాలో చోటు దక్కించుకుంటోంది. ఇక 2017లో ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ అత్యంత సంపన్న కుంటుబాల జాబితాలో హిందూజా ఫ్యామిలీ 12వ స్థానంలో నిలిచింది. వినోద్ అదానీ, హిందూజ బ్రదర్స్ తర్వాత వరుసగా ఉక్కు వ్యాపారి ఎల్‌ఎన్ మిట్టల్ (రూ. 1.5 లక్షల కోట్లు), జే చౌదరి, అనిల్ అగర్వాల్, యూసఫ్ అలీ, షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, శ్రీ ప్రకాష్ లోహియా, రాకేష్ గంగ్వాల్, వివేక్ చాంద్ సెహగల్ ఉన్నారు.  ఇక అత్యంత సంపన్న ఎన్నారైల జాబితాలో అమెరికా నుంచి ఏకంగా 48 మంది చోటు దక్కించుకున్నారు. రూ.70 వేల కోట్ల సంపదతో అగ్రరాజ్యంలో జయ్ చౌదరీ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. కాగా, సంపన్న ప్రవాస భారతీయుల ప్రాధాన్య గమన్యస్థానాల్లో యూఎస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత యూఏఈ, యూకే ఉన్నాయి. 



Updated Date - 2022-09-24T15:19:25+05:30 IST