దేశంలోని టాప్- 10 చౌక ధరల మార్కెట్లు.. ఇక్కడి వస్తువుల ధరలు తెలుసుకుంటే మరో చోటుకు వెళ్లరు!

ABN , First Publish Date - 2021-12-16T14:08:46+05:30 IST

చౌక ధరల మార్కెట్ అనే పేరు వినగానే మనకు

దేశంలోని టాప్- 10 చౌక ధరల మార్కెట్లు.. ఇక్కడి వస్తువుల ధరలు తెలుసుకుంటే మరో చోటుకు వెళ్లరు!

1. ముంబైలోని క్రాఫోర్డ్ మార్కెట్: Crawford Market.. అటు విక్రేతలకు, ఇటు వస్తువులను చౌకగా పొందడానికి ఇష్టపడే వినియోగదాలకు అనువైన ప్రాంతం. ఈ మార్కెట్ 1869లో ఏర్పాటైంది. ఈ మార్కెట్‌లో దొరకని వస్తువు ఏదీ ఉండదని చెబుతుంటారు.  ముంబైలో వివిధ వస్తువులపై భారీగా డిస్కౌంట్‌లు దొరికే మార్కెట్ ఇది.



2. సూరత్ టెక్స్‌టైల్ మార్కెట్(గుజరాత్):  ఇది భారతదేశంలోని ప్రముఖ వస్త్ర మార్కెట్. సూరత్‌లోని వస్త్ర పరిశ్రమ దేశంలోనే అత్యంత పురాతనమైనదిగా పేరొందింది. సూరత్ సింథటిక్ వస్త్రాల ఉత్పత్తికి, విక్రయాలకు నెలవు. దేశంలో ఉపయోగించే పాలిస్టర్‌లో ఎక్కువ భాగం సూరత్ నుండే వస్తుంది. భారత్‌లోని  పలు ప్రాంతాలకు చెందిన వస్త్ర విక్రేతలు ఇక్కడి నుంచే చౌకగా దుస్తులను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.



3. ఢిల్లీలోని చాందినీ చౌక్ మార్కెట్: చాందినీ చౌక్‌ మార్కెట్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంగా పేరొందింది. వినయోగదారులకు ఆనందాన్ని, విక్రేతలకు ఉత్సాహాన్ని అందిస్తుంది. డిజైనర్ దుస్తులు, హస్తకళలు, వెండి ఆభరణాలు మొదలైనవి అత్యంత చౌకగా ఇక్కడ దొరకుతాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఇక్కడి నుంచే వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్‌కు మూడు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది.



4. జోహ్రీ మార్కెట్, జైపూర్(రాజస్థాన్):   రాజస్థానీ హస్తకళలకు నెలవైన అద్భుత వ్యాపార ప్రదేశం జైపూర్. ఇక్కడి జోహ్రీ బజార్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశం. హిందీలో 'జౌహరి' అనే పదానికి 'వజ్రాల కేంద్రం' అని అర్థం. ఈ మార్కెట్‌లో రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన కళాకృతులు తక్కువ ధరలకే లభ్యమవుతాయి.



5. కోల్‌కతాలోని న్యూ మార్కెట్ :  ఈ న్యూ మార్కెట్ కోల్‌కతాలోని లిండ్సే రోడ్‌లో ఉంది. ప్రత్యేకమైన చీరలు మొదలుకొని కుండల అచ్చుల వరకు సమస్తం ఇక్కడ లభ్యమవుతాయి. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఈ మార్కెట్‌లో దొరుకుతుంది. ఈ మార్కెట్‌లో భారీ వ్యాపారం సాగుతుంది. వినియోగదారులకు పలు వస్తువులు చౌకగా లభిస్తాయి. 



6. కాన్పూర్‌లోని లెదర్ మార్కెట్(ఉత్తరప్రదేశ్):  కాన్పూర్‌ను లెదర్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం తోలు ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా తోలు ఉత్పత్తులు ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. ఇక్కడ అత్యంత చౌకగా లెదర్ వస్తువులు దొరుకుతాయి. లెదర్ కోట్లు, బెల్టులు, బూట్లు మొదలైనవి చాలా తక్కువ ధరకు ఇక్కడ లభిస్తాయి. 



7. హజ్రత్‌గంజ్ మార్కెట్, లక్నో(ఉత్తరప్రదేశ్):  హజ్రత్‌గంజ్ నగరం ప్రధాన షాపింగ్ ప్రాంతంగా పేరొందింది. బ్రిటిష్ పాలనలో నిర్మితమైన కట్టడాలు అనేకం ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ మార్కెట్‌లో మొఘలుల శైలిలో గల హస్తకళాకృతులు చౌక ధరలకే లభ్యమవుతాయి. ఈ ప్రాంతం పుస్తక ప్రియులను కూడా అమితంగా అలరిస్తుంటుంది. ఇక్కడి పుస్తకాల దుకాణాలు అనేకం ఉన్నాయి.



8. హబీబ్‌గంజ్ మార్కెట్, భోపాల్(మధ్యప్రదేశ్):  దేశంలోని ప్రముఖ షాపింగ్ ప్రాంతాలలో హబీబ్‌గంజ్ ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఇక్కడ అత్యంత సరసమైన ధరకు డిజైనర్ దుస్తులు లభ్యమవుతాయి.



9. సరోజినీ నగర్ మార్కెట్, ఢిల్లీ:  స్థానికులు ఈ మార్కెట్‌ను "SN" అని కూడా పిలుస్తారు. సరోజినీ బజార్‌.. ఢిల్లీ వాసులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. ఈ మార్కెట్‌కు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్‌లో భారీ స్థాయిలో బేరసారాలు జరుగుతుంటాయి. ఈ మార్కెట్‌లో సాంప్రదాయ వస్తువులతో పాటు ఆధునిక వస్తువులు కూడా లభ్యమవుతాయి. 





10. శ్రీనగర్‌లోని లగ్జరీ కాశ్మీరీ మార్కెట్:  శ్రీనగర్‌లోని కాశ్మీరీ బజార్‌ షాపింగ్ ప్రియులకు ఇష్టమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. పర్షియన్ రగ్గులు మొదలుకొని స్వచ్ఛమైన కుంకుమపువ్వు వరకూ ఇక్కడ అత్యంత చౌకగా లభిస్తాయి. కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లేవారు ఈ మార్కెట్‌లో తప్పనిసరిగా షాపింగ్ చేస్తారు. 











చౌక ధరల మార్కెట్ అనే పేరు వినగానే మనకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అక్కడకు వెళ్లాలని మనసు ఉరకలు వేస్తుంది. చౌకగా దొరికే వస్తువులను వెంటనే కొనుగోలు చేయాలనే ఆశ మొదలవుతుంది. దేశంలో అటువంటి టాప్- 10 మార్కెట్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Updated Date - 2021-12-16T14:08:46+05:30 IST