అమెరికాలో తీవ్రమవుతున్న మధ్యతరగతి వర్గాల వెతలు.. !

ABN , First Publish Date - 2021-10-14T03:08:22+05:30 IST

అమెరికాలో వివిధ వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారి సంపద నానాటికీ పడిపోతోంది. బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో మధ్యతరగతి వర్గం మొత్తం సంపదలో ఏకంగా 26.6 శాతం మేర కోత పడింది.

అమెరికాలో తీవ్రమవుతున్న మధ్యతరగతి వర్గాల వెతలు.. !

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వివిధ వర్గాల మధ్య ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారి సంపద నానాటికీ పడిపోతోంది. బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో మధ్యతరగతి వర్గం మొత్తం సంపదలో ఏకంగా 26.6 శాతం మేర కోత పడింది. ఇప్పటికే పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు..కరోనా సంక్షోభం కూడా తోడై మధ్యతరగతి వారి నడ్డి విరుస్తోంది. 


మరోవైపు.. బిలియనీర్ల సంపద మాత్రం అంతకంతకూ వృద్ధి చెందుతూనే ఉంది. బ్లూబ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో అపరకుబేరులుగా పేరు పడ్డ ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లోనే జాతి సంపదలో ఏకంగా 27 శాతం కేంద్రీకృతమై ఉంది. ‘‘అమెరికా మధ్యతరగతి వర్గాల ఆర్థిక భద్రత క్రమంగా కనుమరుగవుతోందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి’’ అని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. 


కరోనా సంక్షోభం నుంచి అమెరికా ప్రజలను గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం వేల కోట్ల  నిధులను కుమ్మరించినప్పటికీ మధ్యతరగతి వారు మాత్రం క్రమంగా తమ సంపదను కోల్పోయినట్టు ఈ నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం అమెరికా మిడిల్ క్లాస్ వర్గాల మొత్తం సంపద కంటే అపరకుబేరుల వద్ద ఉన్న సంపదే ఎక్కువని బ్లూమ్‌బర్గ్ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-14T03:08:22+05:30 IST