Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేంకటేశ్వరాలయంలో చోరీ

ఏలేశ్వరం, నవంబరు 26: ఏలేశ్వరం మండల పరిధిలోని తూర్పులక్ష్మీపురంలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అర్చకులు సత్యనారాయణశర్మ ఆలయంలో రోజూలానే ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. కాగా శుక్రవారం ఆ హుండీ వ్యవసాయ పంట కాలువలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి ఆలయ ధర్మకర్త పతివాడ రవిబాబు, అర్చకులు దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఆలయాన్ని పరిశీలించగా ప్రధాన ద్వారం తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆలయంలో దుండగులు హుండీని ఎత్తుకెళ్లి రూ.50వేల నగదును చోరీ చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మే నెలలో ఇదే ఆలయంలో రూ.1.50లక్షల నగదును అపహరించుకుపోయారు.

Advertisement
Advertisement