Jun 30 2021 @ 16:11PM

'తుఫాన్' ట్రైలర్ రిలీజ్..

బాలీవుడ్‌ హీరో ఫర్హాన్‌ అక్తర్ నటించిన తాజా చిత్రం 'తుఫాన్' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా దర్శకత్వంలో రూపొందిన ఇందులో మృణాల్‌ ఠాకూర్‌‌, పరేష్‌ రావల్‌, ఇషా తల్వార్‌ కీలకపాత్రలు నటించారు. 'భాగ్ మిల్ఖా భాగ్‌' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఫర్హాన్‌ అక్తర్‌-రాకేష్‌ ఓం ప్రకాశ్‌ మిహ్రా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'తుఫాన్' చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఖచ్చితంగా అందుకుంటుందని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే తెలుస్తోతోంది. ఒక వీధి ఫైటర్.. జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎలా ఎదిగాడు.. అనే ఆసక్తికరమైన కథాంశంతో 'తుఫాన్' తెరకెకించారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 16 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ఇక ట్రైలర్‌లో ఎక్కువగా పంచ్ లు, ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన విధానాన్ని చూపించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే జూలై 16 వరకు వేచి చూడాల్సిందే. 


Bollywoodమరిన్ని...