డ/లూ సృష్టికర్త లూయిస్‌ మృతి

ABN , First Publish Date - 2020-04-03T09:51:25+05:30 IST

క్రికెట్‌లో ఎంతో పాపులర్‌ అయిన డక్‌వర్త్‌-లూయిస్‌ (డ/లూ) విధాన సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూ యిస్‌ (ఇంగ్లండ్‌) మృతి చెందాడు. వర్ష ప్రభావిత మ్యాచ్‌లో...

డ/లూ సృష్టికర్త లూయిస్‌ మృతి

దుబాయ్‌: క్రికెట్‌లో ఎంతో పాపులర్‌ అయిన డక్‌వర్త్‌-లూయిస్‌ (డ/లూ) విధాన సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూ యిస్‌ (ఇంగ్లండ్‌) మృతి చెందాడు. వర్ష ప్రభావిత మ్యాచ్‌లో డ/లూ పద్ధతి  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఈ ఫార్ములా ఆధారంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటారు. 1999లో ఈ విధానాన్ని ఐసీసీ అన్ని మ్యాచ్‌ల్లో ప్రవేశపెట్టింది. అయితే, ఈ పద్ధతిపై కొన్ని అసంతృప్తులున్నా.. అమల్లో ఉన్న వాటిల్లో ఇదే అత్యుత్తమం. లూయిస్‌ (78) మృతికి ఐసీసీ సంతాపం తెలిపింది. 

Updated Date - 2020-04-03T09:51:25+05:30 IST