Abn logo
Mar 1 2021 @ 00:06AM

రేపు అన్నవరంలో రాష్ట్ర పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వార్షిక సభ

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా మార్చి 2న అన్నవరంలో వార్షిక మహోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు  సమాఖ్య గౌరవాధ్యక్షుడు యామిజాల నర్సింహమూర్తి తెలిపారు. ఈ సభకు ఉప సభాపతి కోన రఘుపతి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఆధ్యాత్మికవేత్త మైలవరపు శ్రీనివాసరావు, గౌరవ సలహాదారు  ఈమని రామచంద్ర సోమయాజీ ఘనాపాఠి హాజరవుతారని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement