Tomorrow పులివెందులకు జగన్

ABN , First Publish Date - 2022-07-07T02:47:48+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 9.30 గంటలకు బయలుదేరి 10.20కి కడప

Tomorrow పులివెందులకు జగన్

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan) గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 9.30 గంటలకు బయలుదేరి 10.20కి కడప ఎయిర్‌పోర్టు (Kadapa Airport) చేరుకుంటారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు పులివెందుల (pulivendula)లోని బాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గాన బయలుదేరి పులివెందులలోని అర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ సీఎం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం 1.15 గంటలకు ఏపీ కార్ల్‌కు వెళతారు. 1-35 గంటలకు బయోటెక్‌ సైన్సు కళాశాలకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 1-50 గంటలకు ఐజీ కార్ల్‌ను సందర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో 2-50 గంటలకు వేంపల్లికి చేరుకుంటారు. 3-05 గంటల వరకు స్థానిక నేతలతో సమావేశమౌతారు. 3-20 గంటలకు డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి జడ్పీ హైస్కూల్‌(బాలికల)కు 3-50 గంటలకు చేరుకుంటారు. 4-30 గంటల వరకు ముఖ్యమంత్రి విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 


అనంతరం బాలుర హైస్కూల్‌కు వెళ్లి 4-50 గంటల వరకు విద్యార్థులతో ముఖా ముఖి నిర్వహిస్తారు. 5-05గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 5-15 గంటలకు ఇడుపుల పాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్‌ అతిథి గృహానికి చేరుకొని రాత్రికి అక్కడే బసచేస్తారు. 8వ తేదీ ఉదయం రోడ్డు మార్గాన వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 8-40 గంటలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి 8-50 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 8-55 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9-20 గంటలకు ముఖ్యమంత్రి విమానంలో గన్నవరం బయలుదేరి 10-10 గంటలకు చేరుకుంటారు. కాగా.. ఈ పర్యటనలో మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వాతావరణం సరిగా లేకపోవడం, తేలికపాటి వర్షం కురుస్తుండడంతో ముఖ్యమంత్రి పర్యటనలోని చాలా కార్యక్రమాలు రద్దయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Updated Date - 2022-07-07T02:47:48+05:30 IST