Advertisement
Advertisement
Abn logo
Advertisement

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అమరావతి : ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావం బంగాల్‌, ఒడిశాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.


ఈనెల 11 వరకు కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement