rain: రేపు, ఎల్లుండి కోస్తాకు భారీ వర్షాలు

ABN , First Publish Date - 2022-10-03T01:47:05+05:30 IST

కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి.

rain: రేపు, ఎల్లుండి కోస్తాకు భారీ వర్షాలు

విశాఖ: కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలోని ఆవర్తనం సోమవారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆవర్తనంలో విలీనం కానున్నది. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తాలో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత తగ్గింది. జంగమహేశ్వరపురంలో 34.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2022-10-03T01:47:05+05:30 IST