Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎట్టకేలకు దిగొస్తున్న Tomato ధర.. కిలో ఎంతంటే...

హైదరాబాద్‌ సిటీ : గడచిన కొన్ని రోజులుగా ఆకాశన్నింటిన టమాటా ధన ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. నగరంలో శనివారం కిలో టమాటా ధర రూ.34కు చేరింది. పదిరోజుల క్రితం రూ.100 కు 5 కిలోల టమాటా లభించగా.. ధర రోజురోజుకూ పెరుగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కారణంగా టమాటా సరఫరా దెబ్బతినడం ఇందుకు ప్రధాన కారణం గా మారింది. నగర పరిధిలోని బోయిన్‌పల్లి, సరూర్‌నగర్‌ మార్కెట్లకు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో వ్యాపారులు ధరలు పెంచి కొనుగోలుదారులను అడ్డంగా దోచుకున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ధరలు తగ్గడంతో ప్రజలకు ఊరట లభించింది. మరో రెండు రోజుల్లో కిలో రూ.20 నుంచి రూ.25కే లభించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement