మళ్ళీ పెరిగిన టమోటా ధర

ABN , First Publish Date - 2022-05-12T15:59:05+05:30 IST

నగరంలోని కోయంబేడు మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. బుధవారం నాటి మార్కెట్‌ రేట్ల ప్రకారం కేజీ టమోటా రూ.70 పలుకుతున్నాయి.

మళ్ళీ పెరిగిన టమోటా ధర

అడయార్‌(చెన్నై): నగరంలోని కోయంబేడు మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. బుధవారం నాటి మార్కెట్‌ రేట్ల ప్రకారం కేజీ టమోటా రూ.70 పలుకుతున్నాయి. చిల్లరగా ఈ ధర మరింత ఎక్కువ ఉంది. రెండు రోజుల క్రితం కేజీ టమోటా రూ.50  ఉండగా ఇపుడు రూ.70కి చేరింది. ధర పెరగడంపై కోయంబేడు మార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారి ఒకరు మాట్లాడుతూ, మార్కెట్‌కు వచ్చే టమోటా లోడ్ల సంఖ్య తగ్గింది. బుధవారం 42 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ఒక బాక్స్‌ టమోటాల ధర రూ.500 నుంచి రూ.700గా విక్రయించారు. ఇప్పటికే దక్షిణాది జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఆ జిల్లాల్లో టమోటాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో అక్కడి వ్యాపారులు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ రాష్ట్రాల నుంచి కోయంబేడు మార్కెట్‌కు వచ్చే టమోటా లోడ్లు బాగా తగ్గిన కారణంగానే ధర పెరిగిందన్నారు.

Read more