మళ్లీ పెరిగిన Tomato ధర

ABN , First Publish Date - 2021-11-30T16:13:12+05:30 IST

కోయంబేడు మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా తగ్గినట్లే తగ్గి టమోటా ధర మళ్ళీ పెరిగింది. ప్రస్తుతం కేజీ టమోటాలను రూ.80లకు విక్రయిస్తున్నారు. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల నుంచి టమోటా లారీలు

మళ్లీ పెరిగిన Tomato ధర

                     - kg రూ.80


చెన్నై: కోయంబేడు మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా తగ్గినట్లే తగ్గి టమోటా ధర మళ్ళీ పెరిగింది. ప్రస్తుతం కేజీ టమోటాలను రూ.80లకు విక్రయిస్తున్నారు. రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల నుంచి టమోటా లారీలు తక్కువ సంఖ్యలో కోయంబేడు మార్కెట్‌కు రావటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారుల సంఘం నాయకులు తెలిపారు. ఇటీవల టమోటాలు కేజీ రూ.160ల దాకా విక్రయించారు. ప్రభుత్వం ఫామ్‌గ్రీన్‌ హౌస్‌, రేషన్‌షాపుల్లో టామోటాల తగ్గింపు ధరలతో విక్రయించడం ప్రారంభించడంతో మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆ మేరకు కేజీ టమోటాలు రూ.50లకు విక్రయించారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టమోటాల లోడు లారీల సంఖ్య తగ్గటంతో మళ్ళీ వాటి ధరలకు పెరిగాయి. సోమవారం కోయంబేడు మార్కెట్‌లో కేజీ టమోటాల ధర రూ.80లకు పెరిగింది.

Updated Date - 2021-11-30T16:13:12+05:30 IST