టమోటా కన్నా జొమాటోనే తక్కువ.. షాక్‌ అవుతున్న ఇన్వెస్టర్లు

ABN , First Publish Date - 2022-06-03T02:01:11+05:30 IST

స్టాక్‌ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. లాభాలు ఇచ్చిన స్టాక్స్‌ కొన్ని రోజులకు పాతాళంలోకి తీసుకెళ్తాయి

టమోటా కన్నా జొమాటోనే తక్కువ..	షాక్‌ అవుతున్న ఇన్వెస్టర్లు

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. లాభాలు ఇచ్చిన స్టాక్స్‌ కొన్ని రోజులకు పాతాళంలోకి తీసుకెళ్తాయి. జొమాటో స్టాక్స్‌లో లిస్టింగ్ అయిన కొత్తలో గరిష్టంగా 169 రూపాయల 10 పైసలకు చేరుకుంది. ప్రస్తుతం 72 రూపాయల దగ్గర కొనసాగుతోంది. జొమాటో, నైకా, పేటీఎం వంటి షేర్ల వల్ల రిటైల్ ఇన్వెస్టర్లు సంపదను కోల్పోయారు.


ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి. ఈ సమయంలో అనేక మంది సంపద తుడిచిపెట్టుకుపోతోంది. పలు కంపెనీలు తమ లిస్టింగ్ ధర కంటే తక్కువ రేటుకు ప్రస్తుతం ట్రేడింగ్ అవుతున్నాయి.


దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరి అవుతోంది. 2021-22లో అతిపెద్ద ఐపీఓగా వన్ 97 కమ్యూనికేషన్స్ లిస్ట్ అయ్యింది. జొమాటో, స్టార్‌ హెల్త్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొదట్లో లాభాలు తెచ్చిపెట్టిన జొమాటో ఇప్పుడు నష్టాల్లో కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. భారత్‌లో జొమాటో షేర్‌ కంటే.. టమోటా రేట్‌ ఎక్కువగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2022-06-03T02:01:11+05:30 IST