పెనుగంచిప్రోలు, నవంబరు 27: ధర పెరిగిన టమాటాలపై దొంగల కన్ను పడింది. శుక్రవారం రాత్రి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్‌లోని ఒక కూరగాయల దుకాణంలోకి చొరబడిన దొంగలు టమాటా ట్రేలు ఎత్తుకుపోయారు. మిగిలిన కూరగాయలన్నీ అలాగే ఉండగా.. ఒక్క టమాటా ట్రేలు మాత్రమే ఎత్తుకుపోవడం గమనార్హం. ఎత్తుకుపోయిన టమాటాల విలువ రూ.6 వేలు ఉంటుందని వ్యాపారి సూరిబాబు తెలిపారు.