Cancellation: రేపటి నుంచి మంగుళూరు రైళ్లు పాక్షిక రద్దు

ABN , First Publish Date - 2022-08-26T15:24:18+05:30 IST

తిరుపత్తూర్‌(Tirupattur) పరిధిలోని రైల్వేలైనులో మరమ్మతుల కారణంగా చెన్నై సెంట్రల్‌ - మంగళూరు మధ్య తిరిగే కొన్ని ఎక్స్‌ప్రెస్‏లను 26, 27,

Cancellation: రేపటి నుంచి మంగుళూరు రైళ్లు పాక్షిక రద్దు

చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): తిరుపత్తూర్‌(Tirupattur) పరిధిలోని రైల్వేలైనులో మరమ్మతుల కారణంగా చెన్నై సెంట్రల్‌ - మంగళూరు మధ్య తిరిగే కొన్ని ఎక్స్‌ప్రెస్‏లను 26, 27, 29 తేదీల్లో పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ వివరాలిలా... - 26, 29 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు మంగళూరు సెంట్రల్‌ నుంచి చెన్నై సెంట్రల్‌కు బయలుదేరే వెస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22638) సేలం వరకే వస్తుంది. - 27, 29 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు చెన్నై సెంట్రల్‌(Chennai Central) నుంచి మంగళూరు సెంట్రల్‌ వెళ్లాల్సిన మెయిల్‌ (12601) పాక్షికంగా రద్దయింది. ఈ రైలు సేలం నుంచి బయలుదేరుతుంది.

Updated Date - 2022-08-26T15:24:18+05:30 IST