- అతిథులుగా సోమిరెడ్డి, చింతమనేని, భానుప్రకాష్, దివ్యవాణి
చెన్నై: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం బుధవారం చెన్నైలో జరుగనుంది. స్థానిక టి.నగర్ పార్ధసారధిపురం, వెంకటరామన్వీధిలో వున్న పీఆర్సీ సెంటినరీ హాలులో సాయంత్రం 3 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగరి అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జ్ గాలి భానుప్రకాష్, టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి అతిథులకు హాజరవుతున్నారు. తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు భారీగా హాజరైన ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ చెన్నై ఇన్చార్జ్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి