Spider Man కి ఏడుపుసొస్తే... ఆమె భుజం మీదే తల వాల్చేస్తాడట!

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్పైడర్ మ్యాన్‌గా ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించాడు టామ్ హోల్యాండ్. అతడి ప్రియురాలిగా ఇప్పుడు జెండయా పేరు కూడా మార్మోగుతోంది. మీడియా, సొషల్ మీడియాల్లో వీరి జంట క్రేజీ టాపిక్‌గా మారింది. అయితే, టామ్, జెండయా ఇంత వరకూ తమ రిలేషన్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఆన్ స్క్రీన్ సూపర్ హీరో తన ఫీలింగ్స్‌ని ఎంత మాత్రం దాచుకోవటం లేదు. తాజాగా జెండయా తనకు ఎంత ఆప్తురాలో ఆయన తెలియజేశాడు... 


జెండయాతో తన అనుబంధం గురించి, తామిద్దరూ ఒకేసారి వచ్చి పడిన అంతర్జాతీయ ఖ్యాతిని ఎలా ఎదుర్కొన్నారు అనేదాని గురించి... టామ్ హోల్యాండ్ రీసెంట్‌గా వివరించాడు. తమ మధ్య నెలకొన్న స్నేహం, సాహచర్యం ఎంతగానో 

తోడ్పడ్డాయని ఆయన తెలియజేశాడు. ‘‘ఇద్దరు మిత్రులుగా... ఒక్క చోటకి వచ్చి, ప్రపంచాన్ని ఒకేసారి అనుభవంలోకి తెచ్చుకుంటూ, ఒకే రకమైన సమస్యలు, ఒకే సమయంలో ఎదుర్కొంటూ మేం ముందుకు సాగాం. ఆ క్రమంలో, మాకు దు:ఖం వస్తే ఒకరి భుజంపై ఒకరం తల వాల్చుకోగలిగాం!’’ అన్నాడు టామ్ హోల్యాండ్. 


‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు టామ్ హోల్యాండ్. అయితే, గతంలో తన స్పైడర్ మ్యాన్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించిన జెండయాతోనే మళ్లీ రొమాన్స్ చేయనున్నాడు అమెరికన్ సూపర్ హీరో. తెర మీద లవ్ ఎఫైర్ ఒప్పుకుంటోన్న టామ్ హోల్యాండ్ రియల్ లైఫ్ రిలేషన్ గురించి మాత్రం ఇంకా బయటపడటం లేదు. అదే ఇప్పుడు ఫ్యాన్‌కి, మీడియా వారికి ఆసక్తికరంగా మారింది...

Advertisement