Chitrajyothy Logo
Advertisement

దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

twitter-iconwatsapp-iconfb-icon
దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

ఈ రోజుల్లో ప్రతి సినిమాలో ప్రత్యేక గీతం ఓ అలంకారంగా మారింది. సినిమా జానర్‌ ఏదైనా ఐటెమ్‌ సాంగ్‌ ఉంటే అదో కిక్కు. సినిమా నీరసంగా నడుస్తున్న సమయంలో సందార్భనుగుణంగా ఒక్క ఐటెమ్‌ సాంగ్‌  పడితే థియేటర్‌ దద్ధరిల్లాల్సిందే. ఇక ఆ పాటకు హాట్‌ బ్యూటీలు తోడైతే ఆ కిక్కే వేరప్పా. సినిమా సక్సెస్‌లోనూ ప్రత్యేక గీతం ఎంతోకొంత పాత్ర పోషిస్తుంది. 2021లో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో జిగేల్‌మనిపించిన రాణుల పై ఓ లుక్కేద్దాం. 

దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

సమంత: ఊ.. అంటావా మావ అంటూ ఉలిక్కిపడేలా చేసింది

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌లో మొదటి వరుసలో ఉండే సమంత కెరీర్‌ ఇప్పుడు జోరు మీదుంది. చైతన్య విడాకుల తర్వాత ఆమె కెరీర్‌ లేనట్లే అని అనుకున్నారు చాలామంది. అయితే సామ్‌ మరింత వేగంగా సినిమాలు చేస్తుంది. తాజాగా ప్రత్యేక గీతాలకు సై అంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తీసిన ‘పుష్ప’ చిత్రంలో ఓ ఐటెమ్‌ సాంగ్‌  చేసింది సమంత. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ అంటూ పక్కా మాస్‌ గీతంతో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే సమంత కెరీర్‌ ఆమె చేసిన మొదటి ఐటమ్‌ సాంగ్‌ ఇది. పాట వివాదాల్లో చిక్కుకున్నా క్రేజ్‌కు మాత్రం ఎక్కడా బ్రేక్‌ పడలేదు. 

దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

అప్సరా రాణి: ‘బూమ్‌ బద్ధలు’ కొట్టింది...

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో విడుదలకు ఉన్న ఎన్నో చిత్రాలు నిలిచిపోయాయి. షూటింగ్‌ ఆగిన భారీ చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ ఏడాది సంక్రాంతికి భారీ చిత్రాల హడావిడి అంతగా కనిపించలేదు. ‘క్రాక్‌’ సినిమాతో సంక్రాంతి హిట్‌ బోణీ కొట్టారు రవితేజ. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి స్కోప్‌ ఉండడంతో డెహ్రాడూన్‌ డాల్‌ అప్సరా రాణితో ‘బూమ్‌ బద్ధలు’ సాంగ్‌ చేయించారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆ పాట ఎంతగా ట్రెండింగ్‌ అయిందో తెలిసిందే!  ఈ చిత్రానికి ముందు రెండు సినిమాల్లో హాట్‌ హీరోయిన్‌గా చేసిన రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో తెచ్చుకుంది అప్సర. ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో రెండు ఐటెమ్‌ పాటల అవకాశం పొందింది. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘సీటీమార్‌’లో ‘పెప్సీ’ ఆంటీ పాటతో కూడా అలరించింది. రామ్‌గోపాల్‌ వర్మ ‘ఢీ కంపెనీ’లోనూ ఓ పాటలో మెరిసింది. 

దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!


మోనల్‌: రంభ.. ఊర్వశి.. మేనక... 

కథానాయికగా పలు చిత్రాల్లో నటించి అంతగా సక్సెస్‌ పొందని గుజరాతీ బ్యూటీ మోనల్‌ గజ్జర్‌. కెరీర్‌తో పోరాటం చేస్తున్న సమయంలో ‘బిగ్‌బాస్‌’లో అవకాశః వచ్చింది. ఆ గేమ్‌ షోతో పాపులర్‌ అయిన ఆమె బిగ్‌బాస్‌ ఇంటి నుంచి రాగానే ఓ అవకాశం పట్టేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’లో ‘రంభా.. ఊర్వశి మేనక’ అంటూ సాగే ఐటెమ్‌ గీతంలో ఆడి అలరించింది. 


దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

హెబా పటేల్‌.. ఢించక్‌ డించక్‌

‘అలా ఎలా’, ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రాలతో పక్కింటి అమ్మాయి పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు హెబా పటేల్‌. ఆ తర్వాత వరసగా అవకాశాలు అందుకున్నా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో రూట్‌ మార్చి ఐటెమ్‌ సాంగ్స్‌కు ఓకే చెప్పింది. రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘రెడ్‌’ చిత్రంతో ‘డించక్‌ డించక్‌’ సాంగ్‌తో అలరించింది. తన గ్లామర్‌తోపాటు రిథమిక్‌ డాన్స్‌తో మెప్పించింది. 


దృశ్యం 2021: టాలీవుడ్‌ జిగేల్‌ రాణులు!

అనసూయ..  పైన పటారం.. లోన లొటారం...

అనసూయ బుల్లితెర యాంకర్‌గానే కాకుండా కథా బలమున్న చిత్రాల్లో నాయికగానూ నటించి మెప్పిస్తున్నారు. హాట్‌ యాంకర్‌గా టీవీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె వెండితెరపైనా ఐటెమ్‌ సాంగ్స్‌లో మెరుస్తున్నారు. సాయితేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘విన్నర్‌’ చిత్రంలో సూయ.. సూయ’ అంటూ సాగే గీతంలో హాట్‌హాట్‌గా కనిపించి యువత హృదయాలను గెలుచుకున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘చావు కబురు చల్లగా’ సినిమాలోనూ ఐటెమ్‌ గాళ్‌గా అలరించింది. అందులో పైన పటారం.. లోన లొటారం... అంటూ సాగే పాటలో మాస్‌ మాస్‌గా కనిపించి  మరో మెట్టు ఎక్కింది. అయితే ఆమెపై నెటిజన్లు ట్రోల్‌ చేసిన అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. 

వీటితోపాటు ‘గల్లీ రౌడీ’ చిత్రంలో ‘ఛాంగురే’, శ్రీదేవి సోడా సెంటర్‌’లో ‘మందులోడా ఓరి మాయలోడా’  పాటలు టాలీవుడ్‌ ఓ ఊపు ఊపాయి 


- ఆలపాటి మధు   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement