మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఏ రేంజ్లో హంగామా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్‌ను బట్టి ఆడియన్స్, ఆ మూవీ ఏ రేంజ్లో హిట్ అవుతుందో అని రిలీజ్ కన్నా ముందే ఎవరి లెక్కలు వాళ్ళు వేస్తూ ఉంటారు. అదే విధంగా సినిమా విడుదలైన తొలిరోజే రాబట్టిన వసూళ్లను బట్టి, ఆ హీరో క్రేజ్ ఏంటో, ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో.. అని కూడా అంచనాలు వేస్తుంటారు ఫాన్స్. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అందుకే, కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. విడుదలైన మొదటి రోజే, కోట్లలో కలెక్షన్స్‌ను రాబడుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలైన తొలిరోజే కోట్లలో భారీ కలెక్షన్స్‌ను రాబట్టిన టాప్ 10 తెలుగు సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. ఈ మూవీ మొదటి రోజే 135 కోట్ల కలెక్షన్లను రాబట్టి, బాహుబలి రికార్డులని కూడా బద్దలు కొట్టింది. బాహుబలి 2, తొలిరోజే 123 కోట్ల షేర్‌ను రాబట్టి సెకండ్ ప్లేస్‌లో ఉంది. సాహో రిలీజయిన తొలిరోజే 73.64 కోట్ల షేర్ రాబట్టి థర్డ్ ప్లేస్‌లో ఉండగా... మెగాస్టార్ చిరంజీవి నటించిన పాన్ ఇండియన్ మూవీ సైరా నరసింహారెడ్డి, విడుదలైన తొలి రోజే 53.72 కోట్ల కలెక్షన్లను రాబట్టి 4th ప్లేస్‌లో ఉంది.
ఆ తరువాతి స్థానంలో బాహుబలి 1 సినిమా నిలవగా, తొలి రోజే 46 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఆ తర్వాత ఆరు, ఏడు స్థానాలలో మహేష్ బాబు సర్కారు వారి పాట 36.01 కోట్లు, సరిలేరు నీకెవ్వరు 43.16 కోట్ల చిత్రాలు నిలిచాయి. వీటి తర్వాత 8th ప్లేస్‌లో, భారీ అంచనాలతో విడుదలైన రాధే శ్యామ్ 40 కోట్లు. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా విడుదలైన మొదటి రోజే 39.30 కోట్ల కలెక్షన్లను రాబట్టి 9th ప్లేస్‌లో ఉంది. ఈ లిస్టులో 10th ప్లేస్‌లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్ప సినిమా విడుదలైన మొదటి రోజే 38.49 కోట్ల షేర్ రాబట్టింది.