కేన్సర్ తో బాధపడుతోన్న ప్రముఖ గీత రచయిత

టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటల్ని రాసి మంచి పేరు తెచ్చుకున్నారు కందికొండ. అతి తక్కువ టైమ్ లోనే చక్కటి గీత రచయితగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కేన్సర్ తో పోరాడుతున్నారు. వంద చిత్రాలకు పైగానే పాటలు రాసిన ఆయన్ని పూరీ జగన్నాథ్ ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో చిత్ర రంగానికి పరిచయం చేశారు. అందులో ఆయన రాసిన ‘మళ్ళి కూయవే గువ్వా’ అనే మోలోడీ గీతం ఎంత హిట్టైందో తెలిసిందే. అలాగే ఇడియట్ లోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే సూపర్ హిట్ సాంగ్ కూడా ఆయనే రాశారు. అలాగే తెలంగాణ పై ఆయన రాసిన మాగాణి మట్టిమెరుపు, భోగిమంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, కేటీఆర్ పుట్టిన రోజు గీతం .. వచ్చాడు వచ్చాడు ఒక లీడర్ లాంటి పాటలతో బాగా ఫేమస్ అయ్యారు. ప్రముఖ నిర్మాత, రచయిత కోనవెంకట్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో కందికొండకు కేన్సర్ అన్న విషయం రివీల్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన టాలీవుడ్ టాలెంటెడ్ రైటర్ డా.కందికొండ కేన్సర్ తో పోరాడుతున్నారు. దయచేసి ఆయనకి సహాయం చేయండి అంటూ మినిస్టర్  కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. 


Advertisement