Jul 5 2021 @ 21:06PM

టాలీవుడ్‌ తారలు.. జంతు ప్రేమికులు!

టాలీవుడ్‌ కథానాయికల్లో చాలామంది జంతు ప్రేమికులున్నారు. వారు పెంచుకునే పెట్స్‌ని ఇంట్లో మనిషిగానే భావిస్తుంటారు. ఖాళీ దొరికితే వాటితోనే టైమ్‌పాస్‌ చేస్తుంటారు. ఇటీవల అనుష్క, కాజల్‌, కీర్తి సురేశ్‌, తమన్నా, ఇలియానా, రష్మిక మందన్నా, అదాశర్మ ముద్దుగా ఉండే కుక్క పిల్లలను పెంచుకుంటుంటే.. శ్రుతీహాసన్‌ మాత్రం పిల్లి పిల్లని పెంచుకున్నారు. శ్రుతీహాసన్‌ పెట్‌ ‘క్లారా’

కమల్‌హాసన్‌ గారాలపట్టి శ్రుతీహాసన్‌ ఐదేళ్లగా ‘క్లారా’ అనే పిల్లి పిల్లను పెంచుకుంటున్నారు. క్లారాకి ఫుడ్‌ ఫీడింగ్‌ ఆమె ఇస్తారు. ఆ పిల్లి పిల్లను ‘అది.. ఇది’ అని పిలిస్తే శ్రుతీకి కోపమొస్తుంది. 


తమన్నా పెట్‌ పెబిల్స్‌..

తమన్నాకు పెబిల్స్‌ అని పెట్‌ డాగ్‌ ఉంది. కుటుంబం తర్వాత ఆమె అధిక ప్రాధాన్యం ఇచ్చేది దానికే. తను కరోనా బారిన పడి క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చాక ఒక్కసారిగా హత్తుకుని ముద్దాడింది. తనతో సమయం గడపడం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తమన్నా తరచూ చెబుతుంటారు. 


అనుష్క పెట్‌ ‘జెన్‌’

అనుష్కశెట్టి లాబ్రేడర్‌ డాగ్‌ను పెంచుకుంటున్నారు. దాని పేరు జెన్‌. అదంటే స్వీటీకి చాలా ఇష్టం. ఆమె కుటుంబ సభ్యులు అనుష్క బెస్ట్‌ పెట్‌ మదర్‌ అని అంటుంటారు.  

కీర్తి సురేశ్‌ పెట్‌ ‘నైక్‌’

కీర్తి సురేశ్‌ పెంచుకుంటున్న కుక్క పిల్ల పేరు నైక్‌. దాని వయసు ఏడాది. ఇంట్లో ఉంటే వర్కవుట్స్‌తోపాఉ తన పెట్‌తో ఆడుకోవడమే కీర్తి పని. ఇటీవల నైక్‌తో బీచ్‌ విహారానికి వెళ్లారు కీర్తి. ‘నైక్‌ కన్నా పర్ఫెక్ట్‌ కంపెనీ ఎవరు ఇవ్వలేరని కీర్తి సురేశ్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు. రష్మిక మందన్నా పెట్‌ ‘ఆరా’

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఓ కుక్కపిల్లను తెచ్చుకున్నారు. దానికి ‘ఆరా’ అని నామకరణం చేశారు. తన కన్నా కుక్క పిల్లనే ఎక్కువ ఇష్టపడతానని తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు రష్మిక.  


అనుపమా పరమేశ్వరన్‌ పెట్‌ ‘విస్కీ’

అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్యకాలంలో ఐ లవ్‌ విస్కీ అని పోస్ట్‌ చేయగానే నెటిజన్లు అంతా ఏదో అనుకున్నారు. విస్కీ అంటే నాలుగు ఏళ్ల తన పెట్‌ డాగ్‌ పేరు. అనుపమాకు విస్కీని బ్రదర్‌లా భావిస్తారు. 


ఛార్మి పెట్‌ అలస్కాన్‌.. 

ఛార్మికి చాలా కాలంగా ఓ కుక్క ఉంది. దాని పేరు అలస్కాన్‌. ఛార్మి దానిని బిడ్డలాగా చూసుకుంటారు. తనతోపాటు ఆ డాగ్‌తో వ్యాయామాలు కూడా చేయిస్తుంటారు.