Jun 18 2021 @ 18:02PM

ముగ్గురు స్నేహితులు కలిసిన వేళ!

ఒకప్పటి కథానాయికలకు వృత్తిరీత్యా పోటీ ఉన్నా అభిమానం, ఆప్యాయతలు ఎక్కువ. షూటింగ్‌ సెట్‌లో సరదాగా గడిపేవారు. కలిసి భోజనాలు చేసేవారు. ఇప్పుడు పెళ్లిళ్లు అయ్యి ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉంటున్నప్పటికీ వ్యక్తిగతంగా ఖాళీ దొరకిన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఇటీవల మీనా, మహేశ్వరి, సంగీత కలిశారు. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫొటోను సంగీత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘స్నేహితుల్ని కలిసిన వేళ’ అంటూ రాసుకొచ్చారు. మీనా ఇప్పుడు ‘దృశ్యం2’లో నటిస్తున్నారు. సంగీత ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. మహేశ్వరి తెలుగు సినిమాకు దూరమై చాలా కాలమైన సంగతి తెలిసిందే!