Abn logo
Mar 26 2020 @ 23:19PM

విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్పటి వరకు సాయం ప్రకటించిన వారి లిస్ట్ ఇలా ఉంది..


కోటి విరాళం ప్రకటించిన చిరు:

‘‘ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గం. అయితే ఈ లాక్‌డౌన్ ఎందరో ఉపాధిని కోల్పోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతగా రూ. కోటి విరాళాన్ని అందజేస్తున్నాను..’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర (తెలుగు) ప్రభుత్వాలకి కలిపి పవన్ రూ. 2 కోట్ల విరాళం:

‘‘కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తాను. అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నాను..’’ అని పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు ప్ర‌భాస్‌ రూ. 4 కోట్ల విరాళం:

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి రూపాయలు ప్రకటించారు. ఈ రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లుగా ఆయన ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మహేష్ బాబు రూ. కోటి విరాళం:

‘‘క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో నా వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి కలిపి రూ. కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్నాను. బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌ నిబంధనలను పాటించండి. ఇంటిలోనే ఉండి.. సురక్షితంగా ఉండండి..’’ అని ట్వీట్‌లో తెలిపారు.

రూ. 75 లక్షలు ప్రకటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్:

ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌జేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.

బాబాయ్ స్ఫూర్తితో నేను సైతం: రామ్‌చరణ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సంక్షోభ సమయంలో పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో తాను రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపాడు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించాడు.

రూ. 20 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహాయపడేందుకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నార`ని వంశీ ట్వీట్ చేశారు. 

నితిన్ విరాళం: తెలంగాణకు 10 లక్షలు, ఏపీకి 10 లక్షలు

‘‘కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ రక్షణ నిమిత్తం నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన పరికరాల నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 లక్షలు విరాళం ఇస్తున్నాను. అందరం కలిసి ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం. ఇంటిపట్టునే ఉండి సురక్షితంగా ఉండండి..’’ అని నితిన్ తన ట్వీట్‌లో తెలిపారు. 

ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు: దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి చెందిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాలకూ విరాళం ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షలు చొప్పున దిల్ రాజు విరాళం ప్రకటించారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేశానికి రూ.కోటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకూ రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ రూ.20 లక్షలను విరాళంగా ప్రకటించారు.


సాయితేజ్ రూ. 10 లక్షల విరాళం:

‘‘మనం ఇది వరకు మనం చూడనటువంటి శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. దాని కోసం మనం అందరం కలిసే ఉన్నాం. అలాగే మనం ఆ యుద్ధంలో విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి నా వంతుగా రూ.10 లక్ష‌ల విరాళాన్ని అందిస్తున్నాను.. ఇంట్లోనే ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి’’ అని తన ట్వీట్‌లో తెలిపారు సాయితేజ్.


అనిల్ రావిపూడి రూ. 10 ల‌క్ష‌ల విరాళం:

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని కోరారు.


అల్లరి నరేష్ 50 వేలకు పైగా విరాళం:

‘‘కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల మా ‘నాంది’ యూనిట్‌లో రోజూవారి వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా ఉన్న మా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని, మా యూనిట్ తరుపున నేను.. మా నిర్మాత సతీష్ వేగేశ్నగారు కలిసి, ప్రతి ఒక్కరికి తలా 10 వేల రూపాయలు సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. ఇది గుర్తింపుకోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాలకు ‘నాంది’..’’ అని తెలిపారు.


కొరటాల శివ: రెండు తెలుగు రాష్ట్రాలకూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

వివి. వినాయక్ 5 లక్షలు, 200 బ్యాగ్‌ల నిత్యవసర వస్తువులను జీవితా రాజశేఖర్‌లు అందచేశారు.

హైదరాబాద్‌లోనూ, చెన్నైలోనూ ఉన్న సంగీతకారులకు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. 

ప్రసాద్ గౌడ్, శివాజీ రాజా వంటి వారు వారి వంతు సాయం అందించి ఉదాత్తత చాటుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement